Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • desk
  • KCR భాషనూ KTR నేర్చుకోలేకపోయారా.?

KCR భాషనూ KTR నేర్చుకోలేకపోయారా.?

కేటీఆర్ ఫైర్ మీద ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తావన వస్తే మండిపోతున్నారు. ఆయనేం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కానట్టు తిడుతున్నారు. రాజకీయాల్లో ఉండాల్సింది ఇది కాదు.. మాట్లాడితే ఆవేశ పడకుండా.. మంటపెట్టేలా ఉండాలి. అది కేసీఆర్ వద్ద పుష్కలంగా ఉంది. కానీ ఆయన వారసుడిగా కేటీఆర్ ఆ ఆయుధాన్ని అందుకోలేకపోతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ భాష ప్రత్యేకమైన అస్త్రం. ఆయన మాటల్లో వాడి, వేడి ఉండేది.. అది అవతలి వ్యక్తిని తాకినప్పుడు సెగ పుట్టేది. ఆయన తిట్టినా అందులో ఒక తెలంగాణా యాస, ఒక లోతైన వ్యంగ్యం, రాజకీయ వ్యూహం ఉండేవి. బూతులు వాడినా అవి ఉద్యమ ప్రయోజనాల కోసం వాడినట్లు ప్రజలు భావించేవారు. కానీ కేటీఆర్ తండ్రి నుంచి వ్యూహాలే కాదు భాషా ప్రావీణ్యాన్ని కూడా వంటబట్టించుకోలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ వాడుతున్న పదజాలం, కేసీఆర్ మార్క్ విమర్శలకు ఏమాత్రం సరిపోలడం లేదు. కేసీఆర్ భాషలో టార్గెటెడ్ ఎనర్జీ ఉండేది, అది తన అనుచరుల్లో ఉత్సాహాన్ని నింపేది. ఇటీవల ఆయన ప్రెస్మీట్ లో ఎవర్నీ తిట్టలేదు. కానీ అగ్గి మాత్రం రాజుకునేలా మాట్లాడారు. ఇప్పుడు కేటీఆర్ విమర్శల్లో కేవలం ఆగ్రహం, అసహనం మాత్రమే కనిపిస్తున్నాయి. అది ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం కంటే, తనకే మైనస్ అవుతోందనే నిట్టూర్పు బీఆర్ఎస్ నాయకుల్లోనే వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డిని ఎంత తిట్టినా అది ప్లస్ కాకపోవడానికి కారణం, అందులో కేసీఆర్ స్థాయిలో ఉన్న లాజిక్, లోకల్ ఫ్లేవర్ లేకపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments are closed

Related Posts