సిద్దిపేట మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని లావణ్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య, సిద్దిపేట మెడికల్ కాలేజీలో 2020 బ్యాచ్ మెడిసిన్ విద్యార్థిని కాగా, ప్రస్తుతం హౌస్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తోంది.
ఆత్మహత్య ఉద్దేశంతో లావణ్య పాయిజన్ ఇంజక్షన్ తీసుకున్నట్లు సమాచారం. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ లావణ్య మృతి చెందింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లావణ్య మృతికి గల కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలతో పాటు సహచరుల సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు.
మెడికల్ విద్యార్థిని మృతి ఘటనతో సిద్దిపేట మెడికల్ కాలేజీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.















Comments are closed