ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కీలకమలుపు తిప్పి, కూటమి పార్టీలను విజయబాట పట్టించిన చారిత్రాత్మక ‘యువగళం’ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయ్యాయి. 2023 జనవరి 27 న కుప్పంనుంచి ప్రారంభమైన ఈపాదయాత్ర 226రోజులపాటు 3, 132కిలోమీటర్లు సాగింది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మార్పుపట్ల ఆశలు రగిలించింది. మొత్తం 97నియోజకవర్గాల్లో పర్యటించిన లోకేష్ పాదయాత్ర ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, పాలనలో మార్పు అవసరాన్ని బలంగా చాటారు. పాదయాత్ర సందర్భంగా రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా వినిపిస్తూ ప్రజాస్వామ్య స్వరానికి బలమిచ్చింది.. ప్రజలతో కలిసి నడిచి, ప్రజల తరపున పోరాడిన ఈ పాదయాత్ర రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై గణనీయమైన ప్రభావం చూపిందని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. యువతను కేంద్రంగా చేసుకుని సాగిన యువగళం పాదయాత్ర కూటమిపార్టీల విజయంలో కీలకపాత్ర పోషించింది.రాష్ట్ర ప్రజల తరపున యువగళం పాదయాత్రకు నాయకత్వం వహించిన మంత్రి నారా లోకేష్ కు వివిధ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటానికి యువగళం నిదర్శనమని పలువురు ప్రశంసిస్తున్నారు. ఏపీ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఉద్యమంగా యువగళం పాదయాత్ర ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందని వారు పేర్కొంటున్నారు.















Comments are closed