Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • చేతివృత్తిదారులకు వెల్డింగ్ మిషన్లు అందజేసిన లోకేష్

చేతివృత్తిదారులకు వెల్డింగ్ మిషన్లు అందజేసిన లోకేష్

మంగళగిరి: మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి మండలం కాజ గ్రామంలో ఇద్దరు చేతివృత్తిదారులకు వెల్డింగ్ మిషన్లు అందజేశారు. టీడీపీ నాయకులు మంగళవారం కాజ గ్రామంలో లబ్ధిదారులకు వెల్డింగ్ మిషన్లు అందజేశారు. వెల్డింగ్ మిషన్లు అందుకున్న లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద, బడుగు బలహీన వర్గాల వారికి మంత్రి నారా లోకేష్ వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు చేస్తూ అండగా ఉంటున్నారని అన్నారు. ఎన్నడూ లేని విధంగా మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గాదె పిచ్చి రెడ్డి, గుంటూరు ఛానల్ 2 చైర్మన్ మాణిక్యాల రవి, మండల కార్యదర్శి చింకా కోటేశ్వరరావు రావు, కాజ గ్రామ ఉపాధ్యక్షులు పోతురాజు శ్రీనివాసరావు, మాణిక్యాల గోపి, పల్లబోతుల సాయి కృష్ణ, బొప్ప వాసవి లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments are closed

Related Posts