మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (దాదా) విమాన ప్రమాదంలో మరణించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం మూడురోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు ప్రారంభించాయి. రాడార్, సీసీటీవీ, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) డేటాను విశ్లేషిస్తున్నారు. CM దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే బారామతికి బయలుదేరారు. అలాగే విమాన ప్రమాదంలో పవార్ మృతిపై ఏపీ క్యాబినెట్ సంతాపం వ్యక్తం చేసింది. అజిత్ పవార్ తో తనకు ఉన్న పరిచయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని వ్యాఖ్యానించారు.












Comments are closed