కోటి రూపాయల జీవిత బీమా డబ్బును అన్యాయంగా కాజేయాలనే ఆశతో ఓవ్యక్తి పథకం వేశాడు. తాను చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు, బీమా సంస్థను నమ్మించేందుకు అమాయకుడైన హిచ్‌హైకర్‌ను దారుణంగా హత్య చేశాడు. అయితే ప్రియురాలికి పంపిన మెసేజ్‌లే అతడి ప్లాన్‌ను పూర్తిగా భగ్నం చేశాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో చోటుచేసుకుంది. చవాన్ అనే వ్యక్తి తనపై ఉన్న ఇంటి లోన్ తీర్చేందుకు రూ. కోటి విలువైన జీవిత బీమా పొందాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.
శనివారం గోవింద్ యాదవ్ అనే వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చిన చవాన్, మద్ మత్తులో ఉన్న అతనిని కారు డ్రైవర్ సీటులో కూర్చోబెట్టి సజీవ దహనం చేసినట్టు ఒప్పుకున్నాడు. మృతదేహం తనదేనని అందరూ నమ్మేలా సంఘటన స్థలంలో తన బ్రాస్‌లెట్‌ను కూడా వదిలేశాడు. దీంతో కుటుంబసభ్యులు అతడే మృతి చెందినట్టు భావించారు. అయితే, ఈఘటన తర్వాత చవాన్ తన ప్రియురాలికి మెసేజ్‌లు పంపడం పోలీసులకు అనుమానంగా మారింది. టెక్నికల్ ఆధారాలతో విచారణ చేపట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం బయటపడింది. ప్రస్తుతం చవాన్‌పై హత్య కేసు నమోదు చేసినట్లు లాతూర్ జిల్లా ఎస్పీ అమోల్ తాంబే వెల్లడించారు. ఈ నేరంలో మరెవరైనా పాత్రధారులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.















Comments are closed