Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Telangana
  • కేసీఆర్‌ వల్లే తెలంగాణ దివాళా: మహేశ్‌గౌడ్

కేసీఆర్‌ వల్లే తెలంగాణ దివాళా: మహేశ్‌గౌడ్

మాజీసీఎం కేసీఆర్‌ పాలన వల్లే తెలంగాణ దివాళా తీసిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంపై వడ్డీతో కలుపి దాదాపు రూ.8 లక్షలకోట్ల అప్పులభారం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికస్థితి సంక్షోభంలో ఉన్న సమయంలోనూ కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కంటే ఎక్కువ టికెట్లు కేటాయిస్తామని ప్రకటించారు.

ఉపాధి హామీ పథకానికి గతంలో కేంద్రం నుంచి వందశాతం నిధులు వచ్చేవని, ప్రస్తుతం అమలులో ఉన్న వీబీజీ రామ్‌జీ కారణంగా రాష్ట్రంపై 40 శాతం అదనపు భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అప్పుల భారంతో ఉన్న రాష్ట్రంపై ఈ కొత్త భారం మరింత సమస్యలను తెచ్చిపెడుతోందన్నారు.

Comments are closed

Related Posts