Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Movie
  • MSP Movie : మెగా నామస్మరణతో దద్దరిల్లుతున్న బాక్సాఫీస్..

MSP Movie : మెగా నామస్మరణతో దద్దరిల్లుతున్న బాక్సాఫీస్..

కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి సినిమా స్మరణతో తెలుగు సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ దద్దరిల్లుతోంది. మోస్ట్ సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సెన్సేషన్‌గా మారింది. తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ కేవలం యూట్యూబ్ రికార్డులనే కాదు, సినీ అభిమానుల గుండెల్ని షేక్ చేస్తోంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో ‘చిరంజీవి’ మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైలర్ రిలీజైన 24 గంటల్లో 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ముఖ్యంగా చిరంజీవి సమకాలీన స్టార్ హీరోల ట్రైలర్ రికార్డులను అధిగమించింది. మరోసారి బాస్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపిస్తున్నారు.

చిరంజీవి కెరీర్‌లో ఇది 157వ చిత్రంగా తెరకెక్కుతుండగా, ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నారు. వింటేజ్ చిరంజీవి లుక్, అదిరిపోయే బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కలగలిపి ఈ ట్రైలర్‌ను ఒక విజువల్ ఫీస్ట్‌గా మార్చేశాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జనవరి 7న హైదరాబాద్‌లో జరగనున్న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా హాజరు కాబోతున్నారు. వెండితెరపై వీరిద్దరి కాంబినేషన్ చూడాలని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానులకు, ఒకే వేదికపై ఈ ఇద్దరు దిగ్గజాలను చూడటం కూడా మర్చిపోలేని అనుభూతి కానుంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్నారు.

Comments are closed

Related Posts