ఒంటిచేత్తో తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన ఇంద్రసేనుడు.. కంటిసైగతో టాలీవుడ్ రికార్డుల్ని కొల్లగొట్టిన కొదమసింహం.. సింపుల్‌గా చెప్పాలంటే మన గ్యాంగ్ లీడర్‌ని స్క్రీన్ మీద చూసిన ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఆయనను ఇలాగే చూడాలని కోరుకుంటున్నారు.. ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా అన్నయ్యను చూడాలనుకున్నారో అలా తెరమీద దింపిన దర్శకుడు అనిల్ రావిపూడి.. మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. వెంకటేష్ ప్రత్యేక పాత్ర చేసిన ఈ సినిమా సంక్రాంతి బరిలో విజయం సాధించింది.
ప్రముఖ వ్యాపారవేత్త జీవీఆర్ (సచిన్ ఖేడేకర్) కుమార్తె శశిరేఖ (నయనతార), వరప్రసాద్ (చిరంజీవి) మాజీ భార్యాభర్తలు. విడాకుల తర్వాత చిరంజీవికి పిల్లలను కలిసే అవకాశం కూడా దక్కదు. కేంద్ర మంత్రి నితిన్ శర్మ (శరత్ సక్సేనా) సాయంతో బోర్డింగ్ స్కూల్‌కు పీటీ టీచర్‌గా వెళ్లి పిల్లలకు దగ్గరవుతాడు చిరంజీవి.. ఈ సీన్స్ కొంచెం డాడీ సినిమాను పోలి ఉంటాయి.. చిరంజీవి పిల్లల్ని కలుస్తున్నాడని తెలిసి పిల్లల్ని ఇంటికి తీసుకు వెళుతుంది శశిరేఖ. ఆ తర్వాత జీవీఆర్ మీద ఎటాక్ జరుగుతుంది. అక్కడికి కూడా సెక్యూరిటీ అధికారిగా మళ్ళీ వరప్రసాద్ దిగుతాడు.
పిల్లలకు తమ తండ్రి వరప్రసాద్ అని తెలిసిందా.? లేదా.? అసలు జీవీఆర్ మీద ఎటాక్ చేసింది ఎవరు.? ఇన్వెస్టిగేషన్‌లో వరప్రసాద్ ఏం తెలుసుకున్నాడు.? చివరకు భార్యాభర్తలు ఎలా ఒక్కటయ్యారు? మధ్యలో శశిరేఖను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వెంకీ గౌడ (వెంకటేష్) క్యారెక్టర్ ఏమిటి.? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
చిరంజీవిలో మాంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. సీరియస్ సీన్ల నుండి ఎమోషన్, రొమాంటిక్ సీన్లతోపాటు చిరంజీవి కామెడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే అనిల్ రావిపూడి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్‌లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయడంతో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలు పెంచేసాయి.
కథ కంటే కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అని ఈ సినిమాలోనూ అంతే అన్నట్టుగా అనిపించారు.. ఈకథలో నయనతార ‘విశ్వాసం’ సినిమా గుర్తుకొస్తుంది.. అసలు కధ విషయాన్ని పక్కన పెడితే కథ కంటే చిరంజీవి కామెడీ టైమింగ్ మీద ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఎక్కువ నడిచింది.
ఫస్టాఫ్ నవ్విస్తూ ముందుకు వెళ్ళింది. కథకు కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వడంతో సెకండాఫ్‌లో వినోదం తగ్గుతుంది. సినిమాలో ఎమోషన్స్ ఉన్నాయ్. వాటి కంటే కామెడీ హైలైట్ అవుతుంది. నయన్ & జరీనా వాహెబ్ సీన్ గానీ, చిరు & పిల్లల మధ్య సీన్ గానీ ఎమోషనల్‌గా బాగా తీయడానికి ఆస్కారం ఉంది. అయితే… చిరంజీవి చెప్పిన డైలాగులకు అపోజిట్‌గా జరిగే సన్నివేశాలను బాగా రాశారు.
బీజీఎంతో భీమ్స్ సర్ చాలా ప్రైజ్ చేశారు. ‘బాస్..’ అంటూ వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అభిమానులకు ఆకట్టుకుంది.. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ‘హుక్ స్టెప్…’ హీరో ఇంట్రడక్షన్ సాంగ్. అభిమానులకు అన్నీ బాగా నచ్చుతుంది. ‘శశిరేఖ..’ పాటను కూడా ఎంతో అందంగా చిత్రీకరించారు. చిరంజీవి, వెంకీ మీద తీసిన పాట సైతం అభిమానుల కోసమే అన్నట్టు ఉంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఓకే. సినిమాలో గ్రాఫిక్స్ తక్కువ.. అక్కడక్కడా వీఎఫ్ఎక్స్ వినియోగిచారు.
చిరంజీవి స్లిమ్ లుక్‌లో కనిపించారు. అవకాశం కుదిరిన ప్రతి వినోదాత్మక సన్నివేశంలో చిరు తనదైన టైమింగ్‌తో అదరగొట్టారు. యాక్షన్ సన్నివేశాల్లో మరింత స్టైలిష్‌గా కనిపించారు. ఇంతకు ముందు చిరంజీవి ఇటువంటి రోల్స్ చేశారు. అయితే కొంత విరామం తర్వాత మాస్ & సీరియస్ రోల్స్ వదిలి, మంచి ఫన్ & ఎంటర్‌టైనింగ్ రోల్‌లో వింటేజ్ మెగాస్టార్ కనిపిస్తారు. వెంకటేష్ అతిథి పాత్ర చేయలేదు. కథలో ఆయనది కీలక పాత్ర అని చెప్పొచ్చు.
చిరంజీవి పాటకు వెంకటేష్, వెంకటేష్ పాటకు చిరంజీవి డ్యాన్స్ చేయడం ఇద్దరి అభిమానులకు విజిల్ వర్తీ మూమెంట్.
చిరంజీవి బృందంలో కేథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం కనిపించారు. నయన్ కంటే కేథరిన్ స్క్రీన్ స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది. చివరిలో ఆమె పాత్రకు ఇచ్చిన ముగింపు బావుంది. నయన్ తండ్రిగా సచిన్ ఖేడేకర్, చిరు తల్లిగా జరీనా వాహెబ్, ఒకట్రెండు సన్నివేశాల్లో శ్రీనివాసరెడ్డి, హర్ష కనిపించారు.
సింపుల్ స్టోరీతో తీసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’లో ఎమోషన్స్ కంటే యాక్షన్ సన్నివేశాల్లో చిరంజీవికి ఇచ్చిన ఎలివేషన్స్, కామెడీ టైమింగ్‌లో ఆయన స్టైల్‌కు సూటయ్యేలా డిజైన్ చేసిన సీన్స్, డైలాగ్స్ అభిమానులను, కుటుంబ ప్రేక్షకులను అలరిస్తాయి. మెగాస్టార్ వన్ మ్యాన్ షో చేశారు. సెకండాఫ్‌లో కథ, ఫస్టాఫ్‌తో ఫన్ ఎక్కువ ఉన్నాయి.













Comments are closed