Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • International
  • ట్రంప్ కు బయబడి మోదీ దేశాన్ని తాకట్టు పెట్టడం సరికాదు

ట్రంప్ కు బయబడి మోదీ దేశాన్ని తాకట్టు పెట్టడం సరికాదు

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు దాసోహం అవ్వడం సిగ్గుచేటని సీపీఐ జాతీయ కంట్రోల్ కమీషన్ ఛైర్మన్ కే నారాయణ ఎద్దేవా చేశారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో జరుగనున్న పార్టీ శతాబ్ది ముగింపు వేడుకలను పురస్కరించుకుని శనివారం విజయవాడలోని దాసరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం నేడు ఉద్రిక్తత వాతావరణంలో ఉందని ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వెనిజులా అధ్యక్షుడని, తన బాల్యాన్ని రాత్రికి రాత్రే కిడ్నాప్ చేయడం అత్యంత దురదృష్టకరమైన చర్యగా అభివర్ణించారు.అణ్వాయుధాలు, డ్రగ్స్ సరఫరా నెపంతో వివిధ దేశాలపై దాడులకు తెగపడటం మంచి పరిణామం కాదన్నారు. ఆయా దేశాల రాజకీయ, ఆర్థిక మూలలపై దెబ్బ కొట్టేందుకు ట్రంప్ బ్లాక్ మెయిల్ సింబల్ గా నిలిచాడని పేర్కొన్నారు. దేశంలో పాలన చేస్తున్న మోదీ పర్యటనలో పేరుతో ఇతర దేశాల్లో ఎక్కువగా ఉంటున్నాడని, ట్రంప్ తో స్నేహసంధాలు ఉన్నాయని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.

సుంకాలు పేరు తో భారీగా భారాలు మోపుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, నితిశ్ కుమార్ అండతో కేంద్రంలో బిజేపి పాలన చేస్తోందని, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోదీ కి ఎందుకు వంతపాడుతున్నారని నిలదీశారు. స్వప్రయోజనాలు కోసం మోదీ కి, ట్రంప్ కు దాసోహం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల రెండు తెలుగు రాష్ర్టాల జలవివాదాలు తార‌స్థాయికి చేరుకున్నాయని , ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ‌సూచించారు. అమరావతి రాజధాని కోసం రెండవ సారి భూములు లాక్కోవడం మంచి పద్ధతి కాదని సీఎం చంద్రబాబుకు సూచన చేశారు.గత జగన్ మోహన్ రెడ్డి సమయంలో అమరావతి ప్రజలు పడిన క‌‌ష్టాలు అన్ని ఇన్ని కావని మరలా అదే పరిస్థితులను కూటమి ప్రభుత్వం తీసుకురావడం సరికాదని హితవు పలికారు. అమరావతి ఉద్యమాల్లో అనేకమార్లు పాల్గొన్నానని ప్రజల కన్నీరు తెలుసని ఆ కన్నీళ్లు ఊరికేపోవమని మరలా ఆ పరిస్థితి రాకుండా చంద్రబాబు చూడాలని స్పష్టం చేశారు. టీడీపీ కి ఆక్సిజన్ ఇచ్చినవారికి చేయకుండా ఇంకేవ్వరికి చేస్తావని నిలదీశారు.

అయినాళ్ళోకు ఆకుల్లో…కానోళ్ళకి కంచంలో పెడతావా..? కొండను తవ్వి ఎలుకను పడతవో… లేకపోతే కొండనే తవ్వుతావో తెలియదుకాని అమరావతి ప్రజలకు అన్యాయం చేయవద్దని హితవు పలికారు. అమరావతిలో చాలా మంది తెలిసినవారు ఉన్నారని ఇటీవల ఓ రైతు ఆవేదనతో మరణిస్తే, గుండె పోటు తో చనిపోయాడని చిత్రీకరీంచడం ఎంత వరకు సబబు, ఇది ప్రభుత్వం హత్యా కాదని ప్రశ్నించారు. ఇంత జరిగినా ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి ప్రాధాన్యత అమరావతికి ఇవ్వకుండా ఏఐ… విశాఖపట్నం.. అంటూ ఇంకేదో గాల్లో చూపించడం మంచి పరిణామం కాదన్నారు. రాజధాని విస్తరణ వైపు కాకుండా ప్రజలను సంతృప్తి పరచాలని హితవు పలికారు. భుముల ధరలు పెరగకుండా ఉన్నప్పుడే దురుద్దేశంతో భూములు బలవంతంగా లాక్కొవడం క్రిమినల్ చర్య అన్నారు. భూములు రైతు వద్ద ఉంటే ధరలు పెరిగినప్పుడు రైతుకు మేలు జరుగుతుంది కదా..? మొత్తం లాక్కుని కార్పొరేట్ సంస్థలకు అప్పగించి రైతు నోట్లో మట్టి కొడతవా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన రాజధానిలో ఒక్క ఇంటికి కూడా నష్టం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. స్కూల్స్, స్టేడియం కు వెళ్లడానికి దారి లేదు.. గ్రామస్తులు సమస్యలు పరిష్కరించకుండా దండోరా వేయించి ప్లాట్ నెంబరులు ఇచ్చారని తెలిపారు. ఆ నెంబర్లను తీసుకుని ఫ్లాట్ వద్దకు వెళ్లితే భూమి యజమానులు తరిమి వేశారని తెలిపారు. ఈ విషయం జరిగిన గంటలో 110మంది రైతులు నా దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు.

Comments are closed

Related Posts