కృష్ణాజిల్లా గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవాలను సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రారంభించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహా పలువురు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి నాగార్జున హాజరై సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు.. ఏఎన్నార్ కళాశాల నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన నాగార్జున విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. 1959లో ఏఎన్నార్ కళాశాలకు నాగేశ్వరరావు రూ.లక్ష విరాళం అందించారని గుర్తుచేశారు. నాగార్జున రావడంతో గుడివాడ పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తులంతా ఆయనను చూసేందుకు పోటీ పడ్డారు..









Comments are closed