Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలను పరిష్కరించిన మంత్రి లోకేష్

ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలను పరిష్కరించిన మంత్రి లోకేష్

వైస్సార్సీపీ ప్రభుత్వ పరిపాలనలో ప్రయివేటు విద్యాసంస్థలను వేధించేందుకు భాగంగా అగ్నిమాపక శాఖ నుంచి ప్రతి ఏడాది నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలనే తీసుకోవాలనే నిబంధన పెట్టారు. దీంతో ప్రయివేటు యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గతంలో యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చినపుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ నిబంధనను అయిదు సంవత్సరాలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

ఇటీవల శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్ లు లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఆయన వెంటనే విద్యా, అగ్నిమాపక శాఖల అధికారులకు దీనిపై చర్యలు తీసుకోవాని ఆదేశించారు. ఆ మేరకు ఫైర్ డిపార్టుమెంట్ నుండి తాజాగా జీవో విడుదల చేశారు. 30 మీటర్ల ఎత్తువరకు ఉన్న విద్యాసంస్థలకు 5సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో లోకేష్ హామీ ఇచ్చిన మేరకు పాఠశాలల రెన్యువల్ ను 10 సంవత్సరాలకు పెంచారు. ప్రయివేటు విద్యాసంస్థల సమస్యలను పరిష్కరించిన లోకేష్ గారికి శాసనమండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments are closed

Related Posts