ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి.. ఏ పార్టీ అధికారంలో ఉన్న ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు ఏపీ రాజకీయాల్లో సర్వసాధారణం.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త ఆంధ్ర రాజకీయాల్లో వినిపిస్తోంది.. మంత్రి లోకేష్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.. నారా లోకేష్ ముఖ్యమంత్రి కావడం గ్యారెంటీ అని, వారసుడికి పట్టాభిషేకం చేయాలని కోరిక చంద్రబాబు కూడా బలంగా ఉందని టిడిపి కేడర్లో అందరికీ తెలుసు..
రాష్ట్రం కోసం విజన్ 2047అనే ప్రణాళిక రచించిన చంద్రబాబు తన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి సైతం వ్యూహం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.. అందుకే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాల్సిన అధికారాలను, బాధ్యతలను తరచుగా లోకేష్ కు పంచుకుంటున్నారట.. వచ్చే ఉగాది నుంచి విజయదశమిలోపు రాజకీయంగా, పరిపాలనపారంగా అంతా సానుకూల వాతావరణం ఉన్న సమయంలో లొకేష్ ను చంద్రబాబు ముఖ్యమంత్రి చేస్తారని అనుకుంటున్నారు.
అలాగే ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పదవీకాలం పూర్వవనుంది కాబట్టి ఆమె పదవీకాలం పూర్తయిన తర్వాత రాష్ట్రపతిగా చంద్రబాబు పేరును ఎన్డీఏ ఎంచుకుంటుందని, అప్పుడు చంద్రబాబు రాష్ట్రపతి అయితే లోకేష్ కు పట్టాభిషేకం జరుగుతుందనే ప్రచారం మొన్నటివరకూ వినిపించింది. ఆ తర్వాత చంద్రబాబు రాష్ట్ర పరిపాలనను ఒక గాడిలో పెట్టి తాను కేంద్రమంత్రివర్గంలోకి వెళ్లి లొకేషన్ ముఖ్యమంత్రి చేయాలని భావించారని, ఇప్పుడురాష్ట్రపతి ఆలోచన తెరపైకి రావడంతో చంద్రబాబు ఎటు మొగ్గు చూపుతారనేది తేలాల్సి ఉంది.
అయితే ఈ ప్రచారాలన్ని నమ్మశకంగానే కనిపిస్తున్నా.. నిర్దిష్టంగా ప్రధాని మోదీతో కలిసి కూర్చొని, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమతం తెలుసుకుని అడుగులు ముందుకు వేయాలని చంద్రబాబు భావిస్తున్నారట.. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ యావత్ తెలుగుదేశం పార్టీకి సర్వం తానే అనే సందేశాన్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే 2024 ఎన్నికల్లోను లోకేష్ అండ్ టీమ్ అన్నీ తామై చేసారు. ఇప్పుడు కూడా అటు పార్టీలో గానీ, ఇటు ప్రభుత్వంలో కానీ చంద్రబాబు కూడా లోకేష్ తర్వాతే అన్నంతగా పరిస్థితులు మారాయి.. ఏపని చేయాల్సినా కచ్చితంగా లోకేష్ కు చెప్పాల్సిందే అనే సంకేతాలు కూడా అఫీషియల్ గా వెలువడ్డాయి. ఇలాంటి తరుణంలో లోకేష్ కు పట్టాభిషేకం చేయబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి..















Comments are closed