Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • Lokesh Mark.. విద్యావ్యవస్థలో లోకేష్ మార్క్..

Lokesh Mark.. విద్యావ్యవస్థలో లోకేష్ మార్క్..

గత ప్రభుత్వం 2019-24 నడుమ జీవో 117 తేవడంతో పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజాప్రభుత్వం వచ్చాక జీవో 117 రద్దుచేశామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ…గత ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా పాఠశాల విద్యాభివృద్ధిలో వన్ క్లాస్ – వన్ టీచర్ విధానం చాలా కీలకమైంది. గతంలో 3శాతం పాఠశాలల్లో మాత్రమే వన్ క్లాస్ – వన్ టీచర్ ఉంటే, ఇప్పుడు 33శాతానికి పెంచాం. దీనిద్వారా పిల్లలకు మెరుగైన విద్య అంది, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రధానంగా 5 అంశాలను పరిగణనలోకి తీసుకున్నాం.

ప్రధానంగా లీక్ ప్రూఫ్ బిల్డింగ్, పెయింట్స్, బెంచీలు, టాయ్ లెట్స్, తాగునీరు అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇచ్చాం. ఏపీలో 5స్టార్ రేటింగ్ ఉన్నవి లేవు. 40శాతం 1,2లో స్టార్ లో ఉన్నాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 3, 4 స్టార్ రేటింగ్ కు తేవాలన్నది ప్రజాప్రభుత్వ లక్ష్యం. పెండింగ్ వర్క్స్ పూర్తిచేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరం ఉందో, అక్కడ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని నిర్ణయించాం. ఎస్ఎంసీ ఎకౌంట్ లో రూ.200 కోట్ల నిధులు ఉన్నాయి. బడ్జెట్ లో రూ.800 కోట్లు అదనంగా కేటాయించారు. ఈ రెండు కలిపి వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక మౌలిక సదుపాయాలకు రూ. వెయ్యి కోట్లు ఖర్చుచేసే అవకాశం ఉంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక పద్ధతి ప్రకారం 5స్టార్ రేటింగ్ తెచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. 2014-19 నడుమ చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపునకు చర్యలు చేపడతామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Comments are closed

Related Posts