Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • New PassBooks : జగన్ బొమ్మస్థానంలో ప్రభుత్వ రాజముద్ర..

New PassBooks : జగన్ బొమ్మస్థానంలో ప్రభుత్వ రాజముద్ర..

ఏపీలో నూతన పాస్ పాస్ పుస్తకాలు పంపిణీకి మంత్రి అనగాని శ్రీకారం

వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలం, దోనెపూడి గ్రామంలో స్థానిక శాసన సభ్యులు నక్కా ఆనందబాబు, ఎంపీ కృష్ణప్రసాద్ , బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, CCLA జయలక్ష్మి గార్లతో కలిసి ప్రభుత్వ రాజముద్రతో ముద్రించబడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ పంపిణీ చేసారు. గతంలో జగన్ ఫోటోతో జారీ చేసిన పాసుపుస్తకాల్లోని తప్పిదాలను సవరించి, ప్రభుత్వ రాజముద్రతోపాటు క్యూఆర్ కోడ్స్‌తో రూపొందించిన కొత్త పాసు పుస్తకాలను రైతులకు, భూయజమానులకు అందజేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ హయాంలో ఫొటోలు రంగుల పిచ్చితో పెద్దఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారు. పాస్ పుస్తకాలపై కూడా అప్పటి సీఎం జగన్ ఫొటో ఉండడం చూసి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ తరహా విధానాలకు స్వస్తి పలికింది. స్కూల్ విద్యార్ధుల పాఠ్యపుస్తకాలపై జగన్ ఫొటోలు తీసేసారు. విద్యావ్యవస్థకు రాజకీయాన్ని దూరంగా ఉంచుతున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే నిర్వహించిన 6,688 గ్రామాల్లో జగన్ ఫొటో స్థానంలో ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్‌లతో కూడిన 21.80 లక్షల పాస్ పుస్తకాలను వెబ్ ల్యాండ్‌లోని వివరాలతో సహా ముద్రించారు..

అలాగే నూతన సంవత్సరంలో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న గ్రామ సభలలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో రైతులకు, భూయజమానులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజల పాలిట మరణ శాసనంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌ నుంచి విముక్తి కలగించి, నేడు జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందజేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎం చంద్రబాబు కు ధన్యవాదాలు తెలిపారు.

Comments are closed

Related Posts