కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజాల నిర్వహణలో కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దేశంలో టోల్ విధానంలో మార్పులు చేస్తూ, ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. టోల్ గేట్ వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి, ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు టోల్లు చెల్లించడానికి ఫాస్ట్యగ్ లేదా యూపీఐను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ కొత్త నియమం అమలులోకి వచ్చిన తర్వాత వేగవంతమైన ప్రయాణం, ఇంధన ఆదా, మరియు లావాదేవీలలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.










Comments are closed