తెలంగాణలో సంక్రాంతి పండుగ వేళ రాజకీయ వేడి మొదలైంది. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి సందర్భంగా టోల్ ఫీజు మినహాయించాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాయడంపై BRS శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ BRS నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. “తెలంగాణ ప్రజలపై ఇదే దయ ఎందుకు చూపరు?” అంటూ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగాలు, చదువుల కోసం ఉంటున్న తెలంగాణ బిడ్డలు పండుగల సమయంలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ (ADB), మహబూబ్‌నగర్, నల్గొండ వంటి స్వగ్రామాలకు వెళ్లాలంటే వందల రూపాయల టోల్ ఫీజులు చెల్లించాల్సి వస్తోందని గుర్తుచేస్తున్నారు.
సంక్రాంతికే కాకుండా దసరా, బతుకమ్మ వంటి తెలంగాణ ప్రధాన పండుగల సందర్భంగా కూడా టోల్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని BRS డిమాండ్ చేస్తోంది. భీమవరం బుల్లోడికి ఏపీపై ప్రేమ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.. అలాగే “ఒక మార్గానికే ప్రత్యేక సడలింపు ఎందుకు? తెలంగాణ అంతటా జాతీయ రహదారులపై పండుగల సమయంలో టోల్ మినహాయింపు ఇవ్వాలి” అని సోషల్ మీడియా వేదికగా కోరుతోంది. ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.














Comments are closed