Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • అమరావతిలో NTR విగ్రహం ఓకే.. మరి వంగవీటి రంగా..??

అమరావతిలో NTR విగ్రహం ఓకే.. మరి వంగవీటి రంగా..??

తెలుగు వైభవం.. తెలుగు తేజం అనే కాన్సెప్ట్‌తో రాజధాని అమరావతిలోని నీరుకొండ రిజర్వాయర్‌ దగ్గర ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రాజధాని ప్రాంతంలోని నీరుకొండ గ్రామంలో కొండపై భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహంతోపాటు ఎన్టీఆర్ స్మృతివనం సహా ఇతర డిజైన్లను ఫైనలైజ్చేసినట్టు తెలుస్తోంది. నీరుకొండ ఇప్పటికే మూడు వందల అడుగులు ఉండగా.. ఎన్టీఆర్ విగ్రహాన్ని సుమారు రెండు వందల అడుగులు, అలాగే విగ్రహాన్ని ఏర్పాటు చేసి దిమ్మె మరో 100అడుగులు ఇలా మొత్తం భూమికి 600ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

రాజధాని అమరావతిలోని నిర్మించ తలపెట్టిన ఎన్టీఆర్ విగ్రహ పాదపీఠంలో ఒక మిని థియేటర్ (Mini theater), ఎన్టీఆర్ చరిత్ర తెలిపేలా మ్యూజియం, కన్వెన్షన్ సెంటర్‌ (convention center)ను నిర్మించనున్నారు. మంగళగిరి మండలం నీరుకొండ (Neerukonda) గ్రామంలో నిర్మించే ఈ విగ్రహం దేశంలోనే అతి పెద్దదై ఎన్టీఆర్ విగ్రహంగా రూపుదిద్దుకోనుంది.

మొత్తం వంద అడుగుల ఎత్తులో పాదపీఠం ఏర్పాటు చేసి ఆపైన సుమారు రెండు వందల అడుగుల ఎత్తులో విగ్రహాన్ని నిర్మించనున్నట్లు టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాజధానితోపాటు విజయవాడ గుంటూరులో ఏ ప్రాంతం నుంచి చూసిన విగ్రహం కనిపించేలా నిర్మాణం ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

మరోవైపు ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పుతుండడం సంతోషమే అయినా.. డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కాపు కులానికి గౌరవం ఇస్తూ విజయవాడలో కాపుల ఆరాధ్య దైవం వంగవీటి రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి రానుంది. వైసీపీ హయాంలో వైఎస్సార్ విగ్రహాలు, టీడీపీ హయాంలో ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఉన్నపుడు కాపునాయకుడు వంగవీటి రంగా విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయకూడదని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్, రంగా వంటి నేతలు ఒక కులానికి మాత్రమే పరిమితం కాకపోయినా అందరూ అభిమానించే నాయకులు కాబట్టి ఆ రకంగా అయినా రంగా విగ్రహం ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను రంగా అభిమానులు వెలిబుచ్చుతున్నారు..

ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చిస్తామని, లేకుంటే సీఎం చంద్రబాబుకు వినతి పత్రాలు సమర్పిస్తామంటున్నారు. మరికొందరైతే రంగాపై అభిమానంతో అత్యంత భారీ విగ్రహం మనమే ఏర్పాటు చేద్దామంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు.

Comments are closed

Related Posts