ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (PJTSAU) ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోగా, నలుగురు వర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుంది. లీక్‌కు పాల్పడ్డారని నిర్ధారణ కావడంతో 35 మంది బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్థులను పరీక్షల నుంచి డిస్మిస్ చేశారు. పరీక్షల పవిత్రతను భంగపరిచిన ఈ ఘటనపై వర్సిటీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు.
ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. లీక్‌కు కారణాలు, బాధ్యులెవరు, వ్యవస్థలోని లోపాలపై కమిటీ లోతైన విచారణ చేపట్టి నివేదిక సమర్పించనుంది. వర్సిటీలో జరుగుతున్న ఈ ఘటన విద్యార్థుల్లో ఆందోళనకు దారితీసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత తీసుకొస్తామని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.















Comments are closed