వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. 2 నెలలక్రితం ఇన్‌స్టా ద్వారా పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడిన ఓ యువతి, తన పెళ్లికి అడ్డొస్తున్నారనే కారణంతో కన్న తల్లిదండ్రులనే అంతమొందించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ, తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన కూతురే వారి ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఉంటూ నర్సింగ్ హోంలో నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న నక్క సురేఖ అనే యువతికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉంది.
కులాంతర వివాహానికి సురేఖ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో తాను పనిచేస్తున్న నర్సింగ్ హోం నుండి అనస్థీషియా తెచ్చి, ఒళ్లు నొప్పులకు మందు అని చెప్పి, ఎక్కువ డోసేజ్ మత్తు మందు కలిగిన ఇంజెక్షన్లు తల్లిదండ్రులకు ఇచ్చింది. తల్లిదండ్రులు మరణించిన అనంతరం, సహజ మరణమని తన అన్నకు సమాచారం ఇచ్చింది. అనుమానంతో విచారణ చేయగా, తానే హత్య చేశానని సురేఖ పోలీసుల ముందు అంగీకరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.














Comments are closed