Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • జగన్ కు మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

జగన్ కు మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

pawan kalyan marr warning to ys jagan

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం పెరవలిలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ మాజీ సీఎం వైఎస్‌ జగన్ మాస్ వార్నింగ్‌ ఇచ్చారు. ఇంకొకసారి జగన్ ఇష్టమున్నట్లు మాట్లాడితే సహించేది లేదని పవన్ హెచ్చరించారు. వైసీపీ ఆకురౌడీలకు యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్‌ లాంటి ట్రీట్‌మెంట్ ఇస్తేనే తిక్క కుదురుతుందన్నారు పవన్..

పెరవలిలో అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం తలచుకుంటే తీవ్రవాదమే కకావిలకమైందని, కిరాయి గూండాలు, రౌడీల వివరాలు ఆరా తీస్తే పరిస్థితి తెలుస్తుందన్నారు. రౌడీలపై రాజకీయ నిర్ణయం తీసుకుంటే మళ్లీ ఇలాంటి మాటలు రావని పేర్కొన్నారు.

మెడికల్‌ కళాశాలల నిర్వహణను ప్రైవేట్‌ వ్యక్తులు తీసుకుంటే తాము అధికారంలోకి వచ్చిన తరువాత జైలుకు పంపిస్తామంటూని జగన్‌ చేసిన హెచ్చరికల నేపధ్యంలో పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. దౌర్జన్యాలకు దిగుతూ మళ్లీ వస్తామంటూ దిగజారి మాట్లాడుతున్నారని పవన్ దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడేం చేస్తారంటూ విమర్శించారు. ఎవరి బెదిరింపులకు తమ కూటమి ప్రభుత్వం భయపడలేదని, రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీతో జతకట్టి వేలకోట్ల రూపాయాలతో కార్యక్రమాలు చేపడుతున్నామని పవన్ పేర్కొన్నారు.

Comments are closed

Related Posts