గార్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో నమోదైన ఒక పోక్సో కేసులో నిందితుడికి మహబూబాబాద్ జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.17,000 జరిమానా విధించింది.
2022 సంవత్సరంలో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గార్ల పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్లు 363, 354(ఏ), 506 మరియు పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో నిందితుడైన ముల్లంపల్లి సుమంత్ (22) ను కోర్టు దోషిగా నిర్ధారించి న్యాయమూర్తి ఎండీ. అబ్దుల్ రఫీ నిందితుడికి నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
కేసు విచారణలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య వాదనలు వినిపించగ కోర్టు లైజనింగ్ అధికారిగా జీనత్ (ఎస్.ఐ డీ.సీ.ఆర్.బి), దర్యాప్తు అధికారిగా బి. వెంకన్న (ఎస్.ఐ గార్ల) పనిచేశారు. ట్రయల్స్‌లో సాయికుమార్ (ఎస్.ఐ గార్ల), రవీందర్ (సీఐ –గార్ల,బయ్యారం) సహకరించారు. కేసు డాక్యుమెంటేషన్ బాధ్యతలను జే.రాజు (సీడీఓ) నిర్వహించారు.















Comments are closed