ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటుండగా, శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం సంచలన నిర్ణయంతో ప్రభాకర్ రావుకు లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సిట్ ఎదుట రేపే సరెండర్ కావాలని అధికారులు మాత్రం ఫిజికల్ టార్చర్ చేయొద్దని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది కోర్టు.. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం, ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ (SIT) అధికారుల ఎదుట బేషరతుగా లొంగిపోవాలి. ఈ ఆదేశాలు కేసు దిశనే మార్చేలా ఉన్నాయని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, లొంగిపోయే ప్రక్రియలో లేదా తదుపరి దర్యాప్తులో ప్రభాకర్ రావుపై ఎటువంటి శారీరక హింస, ఫిజికల్ టార్చర్ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టమైన సూచనలు జారీ చేసింది. దర్యాప్తు బృందం పూర్తిగా చట్టబద్ధంగా, మానవహక్కులకు విరుద్ధంగా కాకుండా వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏకకాలంలో రాజకీయ, చట్టపరంగా ప్రాధాన్యం సంతరించుకున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు పరిశీలనీయంగా మారాయి. ప్రభాకర్ రావు సరెండర్ తర్వాత దర్యాప్తు వేగం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేసు మొత్తానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.









Comments are closed