ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా భవన్ లో ప్రజావాణి ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పిర్యాదులు పరిష్కారానికి కృషి చేసిన వివిధ విభాగాల అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించి ప్రశంస పత్రాన్ని అందించారు.
ప్రజావాణి ద్వారా గతంలో ఆర్టీసీ లో శాశ్వతంగా సర్వీసు నుండి తొలగించిన 242 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేసారు. ప్రజావాణి ద్వారా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న 1750మంది డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల సమస్యలు పరిష్కారం అయ్యి వారికి ఇళ్లు కేటాయించడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేసారు. ఆదిలాబాద్ లో దళిత రైతుల సమస్యల పరిష్కారం, విదేశాల్లో ఉన్న గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి తీసుకున్న చర్యలను ప్రశంశించారు. ఈ పందర్భంగా ప్రజావాణి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.














Comments are closed