Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Politics
  • సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ఆర్.కృష్ణయ్య

సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ఆర్.కృష్ణయ్య

సీఎం రేవంత్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో నిర్వహించాలని ఆచన లేఖలో ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బీసీ భవన్‌లో కృష్ణయ్య వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికలకు ముందు చేసిన కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో అమలు చేస్తామని ఇచ్చిన హామీని ఈ ఎన్నికల్లో అమలు చేయాలన్నారు.

ఇటీవల నిర్వహించిన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందన్నారు కృష్ణయ్య. ఇప్పటికైనా రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు చేసిన తర్వాత నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం అలా చేయకుండా ఎన్నికలకు వెళితే జాతీయ బీసీ సంక్షేమసంఘం తరఫున పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం చేపడతామని కృష్ణయ్య హెచ్చరించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243డీసీ ప్రకారం స్థానిక సంస్థల్లోని బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. బీసీలకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలుచేసి మాట నిలుపుకోవాలని కోరారు.

Comments are closed

Related Posts