ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజుకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. రాజ్యంగ బద్దమైన పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడుతూ, టీవీ చర్చల్లో పాల్గొంటున్నారనే ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రఘురామ పైన వచ్చిన ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏవిధంగా స్పందిస్తారనేది కీలకంగా మారుతోంది. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి పొలిటికల్ డిబేట్స్‌లో పాల్గొంటున్నందుకు రాష్ట్రపతికి జేబీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ కుమార్ ఫిర్యాదు చేసారు. కాగా, డిప్యూటీ స్పీకర్‌పై చర్యలకు న్యాయస్థానా లను ఆశ్రయిస్తున్నట్లు తెలిపిన JBP పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ సైతం వెల్లడించారు.
దీంతో రాష్ట్రపతి కార్యాలయం నుంచి సీఎస్ కు పంపిన లేఖలో పిటీషనర్ ఇచ్చిన రిపోర్ట్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు. డిప్యూటీ స్పీకర్ పదవులు తీసుకున్న వారు రాజకీయ పార్టీల కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని జడ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. రఘురామ టీవీ చర్చల్లో పాల్గొంటూ రాజకీయ అంశాలపై ప్రత్యక్షంగా స్పందించకూడదని వివరిస్తున్నారు. ఇది ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పార్టీ ఫిర్యాదు చేసింది. తాజాగా రాష్ట్రపతి కార్యాలయం సూచనతో రఘురామపై చర్యలు తీసుకోవాలని సిఫారసు రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి స్పందన ఏంటనేది కీలకంగా మారుతోంది.















Comments are closed