టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వడంపై తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రకుల్ మళ్లీ తెలుగు సినిమాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మంచి కథకోసం ఎదురుచూస్తున్నానని, ‘బాహుబలి’ లాంటి గొప్ప చిత్రాల్లో నటించడం తన కల అన్నారు.
హైదరాబాద్ పంజాగుట్టలో ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ కడాలి చక్రవర్తి నూతనంగా ఏర్పాటుచేసిన “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడమీ”ని రకుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
తనకు తొలి విజయాన్ని అందించింది తెలుగు సినిమానే అని.. ఇక్కడి ప్రేక్షకులు తనను ఎంతో ఆదరించారన్నారు. ఇటీవల తెలుగు సినిమాలు చేయకపోవడంతో అందరినీ మిస్ అవుతున్నానని, మంచి కథ దొరికితే తప్పకుండా నటిస్తానన్నారు. తన అభిమానులంతా తనకోసం ప్రార్థించాలని రకుల్ కోరారు.
హైదరాబాద్‌లోనే ఉండి షూటింగ్ చేయాలనే కోరిక బలంగా ఉందని, ప్రస్తుతం కొన్నికథలు వింటున్నానని తెలిపారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన రకుల్ అనంతరం ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలతో కలిసి నటించారు. హీరోయిన్ గా స్టార్‌డమ్ సంపాదించిన తర్వాత బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారించారు. అనంతరం నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న రకుల్ తెలుగు సినిమాలకు గ్యాప్ ఇఛ్చారు.









Comments are closed