Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Blog
  • రేవంత్ చర్యలు భేష్.. స్థూల ఉత్పత్తిలో 6.7శాతం దాటిన తెలంగాణ

రేవంత్ చర్యలు భేష్.. స్థూల ఉత్పత్తిలో 6.7శాతం దాటిన తెలంగాణ

వరి పంట సాగు, విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ పంజాబ్‌‌ను దాటేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో వ్యవసాయం వాటా 6.7శాతం పెరిగింది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం వ్యవసాయ రంగం వాటా గతేడాది రూ.1,00,004 కోట్లు నమోదవగా 2024–25 అంచనాల ప్రకారం రూ.1,06,708 కోట్లకు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో పంటలసాగు విస్తీర్ణం పెరిగింది. 2023 –24 సీజన్‌లో 209.62లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగుచేయగా ఇప్పుడు 296.17లక్షల మెట్రిక్ టన్నులకు దిగుబడి చేరుకుంది.

2024 –25 ఏడాది‌లో సాగు విస్తీర్ణం 220.77లక్షల ఎకరాలకు పెరిగగా.. దిగుబడి 320.62 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. తెలంగాణలో ప్రధానపంట అయిన వరి 2023–24లో 118.11 లక్ష్లల ఎకరాల్లో సాగు చేయగా.. ఈ ఏడాదికి అది 127.03 లక్షల ఎకరాలకు పెరిగింది. అలాగే ధాన్యం దిగుబడి 260.88లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఈ ఏడాది వానాకాలం, యాసంగిలో కలిపి 284.16 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. పత్తి సాగు ఇంచుమించుగా గత రెండేండ్లుగా ఒకే తీరుగా ఉంది.

తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసింది. రూ.54,280 కోట్లతో వివిధ పథకాలను అమలు చేయడంతో ఆ ఫలితమే దేశంలోనే వరిసాగు విస్తీర్ణంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. 66.77లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా గతంలో ఎన్నడూ లేనివిధంగా 153లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు ఒకేసారి రూ.2లక్షల పంటరుణాలు మాఫీ చేసి, 25లక్షల 35వేల 964 రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రైతులకు పంటల పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా పంపిణీలోనూ ప్రభుత్వం‌‌ రికార్డ్ నమోదు చేసింది. ఎకరానికి రూ.12వేల చొప్పున రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ భరోసా నిధులు పంపిణీ చేసింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు 69,86,548 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేసింది. ఈఏడాది వానాకాలం పంటలకు ఇప్పటికే రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా కేవలం 9రోజుల్లోనే రూ.8744 కోట్లు జమ చేసింది.

రైతులకు ఆపద వస్తే వారి కుటుంబాలు ధీమాగా ఉండేలా బీమాను ప్రభుత్వం అమలు చేస్తున్నది. రైతులు ఏ కారణంతో మరణించినా రూ.5లక్షల బీమా పరిహారాన్ని బాధిత కుటుంబానికి అందిస్తుంనది. 42.16లక్షలమంది రైతుల కుటుంబాలకు ప్రభుత్వం జీవిత బీమా కంపెనీకి ప్రీమియం చెల్లిస్తుంది. వ్యవసాయానికి సంబంధించి గతప్రభుత్వం నిలిపేసిన 16కేంద్ర ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ సర్కార్ పునరుద్ధరించింది. అలాగే ధాన్యం కొనుగోళ్లపైనా ప్రభుత్వం ఫోకస్ పెంచింది.

ప్రస్తుత సీజన్‌లో 8,380 కేంద్రాలు ఏర్పాటుచేసి ఇప్పటికే 38.72లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. సెంటర్లలో ధాన్యం అమ్మిన రైతులకు రెండు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇస్తున్నది. దీంతో రాష్ట్రంలో సన్నరకాల వరిసాగు విస్తీర్ణం పెరిగింది. ఈ సీజన్‌లో ఇప్పటికే సన్నాలు అమ్మిన రైతులకు రూ.314 కోట్ల బోనస్ చెల్లించింది. గత ఏడాది మార్చి, సెప్టెంబర్‌లో వడగండ్లు, వర్షాలతో నష్టపోయిన 94,462 మంది రైతులకు రూ.95.39 కోట్ల పరిహారం అందించింది.

Comments are closed

Related Posts