రాజకీయాలల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్.. ఒక్కోసారి కొందరు నేతలు ఆడే మైండ్ గేమ్ ఎవరూ ఊహించలేరు. అలాంటి వ్యక్తుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరు.. ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో విజయాలతో కూల్ గా ఉన్న రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ గట్టిగా ఆడుతున్నారు. దీన్ని కేటీఆర్, హరీష్ తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు.
ఈ పరిస్థితిని రేవంత్ మరింత అనుకూలంగా మల్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ప్రెస్మీట్ పెట్టారు. మెజార్టీ సీట్లు సాధించిన కాన్ఫిడెన్స్ తో ఆయన చాలా కూల్ గా మాట్లాడారు. రాజకీయంగా మాత్రం బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేసారు.
కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ ఒక్క ఎన్నికలోనూ గెలవలేదని, ఇదే అదునుగా హరీష్ రావు పార్టీ నాయకత్వాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నట్లు రేవంత్ వ్యాఖ్యలు చేశారు.
ఆ వెంటనే హరీష్ రావు స్పందిస్తూ కేటీఆర్‌కు, తనకు మధ్య మిత్ర భేదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎప్పటికీ తన గుండెల్లో కేసీఆర్, గులాబీ జెండా ఉంటాయని వివరణ ఇచ్చుకున్నారు. మరోవైపు ఇప్పటికే హరీష్ రావును కవిత టార్గెట్ చేస్తున్నారు. హరీష్ పై సోషల్ మీడియాలోనూ రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో హరీష్ రావు సైతం ఒత్తిడికి గురవుతున్నారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చాయంటున్న బీఆర్ఎస్‌లో ఎక్కడా ఆ జోష్ కనిపించట్లేదు. కేటీఆర్ కూడా పదే పదే ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు . కేసీఆర్ కంటే పెద్దవయసు ఉన్న ఓ నాయకుడిని పట్టుకుని చనిపోవడమే మేలని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలపైనా నోరు పారేసుకుంటున్నారు.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న వ్యక్తి అలా మాట్లాడటం మాత్రం అభ్యంతరకరంగా ఉంది. పంచాయతీలు గెలిచామని కాంగ్రెస్ కు ప్రజలు షాకిచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆఎస్ దానికి తగ్గ రాజకీయాలు చేయాలి కానీ రేవంత్ రాజకీయ వ్యూహాల్లో చిక్కుకుని ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారని తెలుస్తోంది.
సిరిసిల్లలో కేటీఆర్ మెజార్టీ పంచాయతీలను కోల్పోయారు. కానీ హరీష్ రావు మాత్రం మెజార్టీ పంచాయతీలను సిద్ధిపేటలో గెల్చారు. గజ్వేల్ లోనూ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ పరిస్థితి చూస్తూంటే రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ తంటాలు పడుతోందని అర్ధమవుతోంది.
రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు కేసీఆర్ రావాల్సిందేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. 21వ తేదీన బీఆర్ఎస్ సీఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారా మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్లిపోతారా అన్నది క్లారిటీ వస్తుంది. కేడర్ మాత్రం కేసీఆర్ రావాలని అప్పుడే రేవంత్ కు కౌంటర్ ఇవ్వగలుగుతామని భావిస్తున్నారు.














Comments are closed