Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Politics
  • రేవంత్ రెడ్డి దూకుడు.. త్వరలో మున్సిపల్ ఎన్నికలు..

రేవంత్ రెడ్డి దూకుడు.. త్వరలో మున్సిపల్ ఎన్నికలు..

revanth reddy smile

పంచాయతీ ఎన్నికలను పూర్తిచేసి, కాంగ్రెస్ అభ్యర్ధులు విజయదుందుభి మోగించిన ఈ ఊపులోనే మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం ముగిసిపోయే నాటికల్లా మొత్తం మున్సిపల్ సహా..గ్రేటర్ పాలక వర్గానికీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని మున్సిపాల్టీల్లోని కాంగ్రెస్ నేతలకు ఎన్నికలకు సిద్ధం కావాలని సమాచారం వెళ్లినట్లుగా చెబుతున్నారు. మున్సిపాలిటీల కార్యవర్గాల పదవీకాలం ముగిసి ఏడాది అవుతోంది. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నాయి. ఫిబ్రవరి వరకూ గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం గడువు ఉంటుంది. చట్టబద్ధంగా గడువు ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా పరిపాలనాపరమైన కారణాల వల్ల నిర్ణయం తీసుకోలేదు. అలాగే బీసీ రిజర్వేషన్ల అంశం ఊపందుకోవడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పెండింగ్ పడిపోయింది. ఇది తేలే అవకాశం లేకపోవడంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు అదే పద్దతిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో గత మున్సిపల్ ఎన్నికలు జనవరి 2020లో జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 120మున్సిపాలిటీలు , 9మున్సిపల్ కార్పొరేషన్లకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి అధికారపార్టీ భారత్ రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేస్తూ దాదాపు 109 మున్సిపాలిటీలను, మొత్తం 9 కార్పొరేషన్లను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది.

కాంగ్రెస్ పార్టీ కేవలం 4మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ ఆమనగల్ , తుక్కుగూడ వంటి 2 మున్సిపాలిటీల్లో జెండా పాతగా, ఎంఐఎం భైంసా , జల్పల్లి మున్సిపాలిటీలను గెలుచుకుంది. 2020లో కొలువుదీరిన ఈ మున్సిపల్ పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం జనవరి 2025 నాటికి ముగియనుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల్లో ప్రభావం చూపించడంతో ఇక పట్టణాల్లోనూ హవా తగ్గలేదని నిరూపించాలని అనుకుంటున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కీలకం కానున్నాయి. ప్రతిపక్ష బిఆర్ఎస్ తన పాతకోటలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తుండగా.. బిజెపి పట్టణ ప్రాంతాల్లో తమ బలాన్ని ఓట్లుగా మలుచుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇంకా ఆలస్యం చేస్తే సమస్యలు వస్తాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే రేవంత్ ఎన్నికలు నిర్వహించాలని, ఆలస్యమయ్యే కొద్దీ సమస్యలు వస్తాయని.. వేగంగా నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ..

Comments are closed

Related Posts