మున్సిపల్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పన్నెండేళ్ల బీజేపీ, పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజువేసి ఓటువేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 116మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖపోటీ నెలకొందని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. “మనం కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి ఇస్తే, తిరిగి మనకు 42 పైసలే ఇస్తున్నారు. అదే ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్‌కు రూ.6.06, యూపీకి రూ.2.90 ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలపై ఈ వివక్ష ఎందుకని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎప్పుడైనా మోదీని ప్రశ్నించారా?” అని నిలదీశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని 2014లో హామీ ఇచ్చి మోసం చేశారని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వరదబాధితులకు కారుకు కారు, బైకుకు బైకు ఇస్తామని చెప్పిన బీజేపీనేతలు, ఆతర్వాత ఆహామీని గాలికొదిలేశారని విమర్శించారు. “గల్లీ ఎన్నికకు ప్రధాని మోదీకి ఏంసంబంధం? ఆయనేమైనా వచ్చి మోరీలుతీస్తారా?” అంటూ ఎద్దేవాచేశారు.పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీఆర్ఎస్, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతోందని రేవంత్ విమర్శించారు.














Comments are closed