తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటివరకు అమలులో ఉన్న దూరం ఆధారిత ఫీజు విధానానికి తెరదించుతూ, ఇకపై ఫిక్స్‌డ్ ఛార్జీల విధానాన్ని అమలు చేయనున్నారు.
ఇంతవరకు విద్యుత్ స్తంభాలు, లైన్ల ఏర్పాటుకు వినియోగదారుల నుంచి ఇంటి దూరాన్నిబట్టి వేర్వేరు రీతుల్లో చార్జీలు వసూలు చేసేవారు. ఈవిధానం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడుతుండగా, ఇకపై ఈ సమస్యకు పరిష్కారంగా ఒకే విధమైన ఫిక్స్‌డ్ ఛార్జీలు నిర్ణయించారు.
కొత్త మార్గదర్శకాల ప్రకారం గృహ వినియోగదారులకు 1 కిలోవాట్ సామర్థ్యం వరకు విద్యుత్ కనెక్షన్‌కు రూ.500 మాత్రమే వసూలు చేయనున్నారు. అలాగే 1 కిలోవాట్ నుంచి 5 కిలోవాట్ సామర్థ్యం వరకు రూ.500కు అదనంగా ప్రతి కిలోవాట్‌కు రూ.600 చొప్పున ఫీజు విధించనున్నారు. ఈ కొత్త ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు.














Comments are closed