Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Blog
  • “హిల్ట్” పై బురదచల్లుతున్న కేటీఆర్.. మరి సిరీస్ భూముల మాటేంటి..?

“హిల్ట్” పై బురదచల్లుతున్న కేటీఆర్.. మరి సిరీస్ భూముల మాటేంటి..?

హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఇప్పుడు వాసవి రియల్ ఎస్టేట్ అనే కంపెనీ ఓ భారీ అపార్టుమెంట్ కాంప్లెక్స్ నిర్మిస్తోంది. ఎల్బీనగర్ మెట్రో నుంచి డైరక్ట్ గా ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి రోడ్డు కూడా ఉంటుంది. వాస్తవానికి ఆ ల్యాండ్ ను గత ప్రభుత్వం ఓ ఫార్మా పరిశ్రమకు ఇచ్చింది. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా చేస్తున్నారు అనే సందేహం చాలామందికి వచ్చి ఉండొచ్చు.. దీనిపై ఇప్పటికే చర్చ నడుస్తోంది.. ఇదంతా కేటీఆర్, కేసీఆర్ తీసుకున్న నిర్ణయమేనని రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా ముఖంగా ప్రకటించారు. ఇరవై ఏళ్ల క్రితం ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతంగా ఉన్న ఎల్బీనగర్ లో సీరిస్ ఫార్మా కంపెనీ పెట్టారు.. ప్రభుత్వం నలభై ఎకరాలు లీజుకు ఇచ్చింది.. ఆ పరిశ్రమతో ఇబ్బందులు వస్తాయని చుట్టుపక్కల ప్రాంతాలవాసులు నిరసనలు చేయగా.. కాలక్రమేణా సీరిస్ మూతపడింది. అలాంటి కంపెనీ బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ గా మారిపోయింది.

ల్యాండ్ కన్వర్షన్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతివ్వడంతో కేసీఆర్, కేటీఆర్ సంతకాలు చేయగా.. ఆ స్థలం వాసవి సంస్థకు వెళ్లింది.. దాంతొ వాళ్లు డెలవప్మెంట్ చేపట్టారు.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం .. అదే పాలసీతో మూతపడిన, కాలుష్య కారకపరిశ్రమల భూములను మల్టీయూజ్ గా మార్చేందుకు పాలసీ తెచ్చింది. దీన్నే కేటీఆర్ స్కాం అంటూ ప్రచారం చేస్తున్నారు.. అలాంటి సిరీస్ సీరీస్ భూముల్లో కేటీఆర్ చేసిందేంటి.. వాళ్లు కూడా స్కాం చేసినట్టేనా..

ఇప్పుడు సరిగ్గా రేవంత్‌ రెడ్డి సర్కార్ ఔటర్‌ లోపల నిరూపయోగంగా ఉన్న పారిశ్రామిక భూములు, కాలుష్య కారక పరిశ్రమలను తరలిస్తే ఖాళీగా ఉండే భూముల విషయంలో హిల్ట్‌ పాలసీ తీసుకువచ్చింది. దీనివల్ల రియల్‌ ఎస్టేట్ కు మంచి అవకాశం ఉంటుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఔటర్ లోపలి 9వేల ఎకరాల పాత ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ను రెసిరెన్సియల్‌, కమర్షియల్‌, ఐటీ, మల్టీయూజ్డ్ జోన్‌లుగా మార్చేందుకు ఈ పాలసీ ఉపయోగపడనుంది.

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయంతో ఓఆర్ఆర్ లోపలి పురాతన పారిశ్రామిక వాడల భవిష్యత్తు కొత్త మలుపు తీసుకోబోతోంది. కాలుష్య పరిశ్రమలను బయటకు తరలించి, ఆ విలువైన భూములు నగర అభివృద్ధికి ఉపయోగపడనున్నాయి.. ఇప్పటికే గ్రేటర్ లోపల ఉన్న 22 పారిశ్రామిక వాడల్లోని భూములను బహుళ వినియోగ జోన్ లుగా మార్చుకోవడానికి వీలుగా తెలంగాణ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్టుమెంట్ సీఎస్ సంజయ్ కుమార్ జీఓఎంఎస్ నంబరు – 27 పేరుతో నవంబరు 22న ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రధానంగా నాచారం, జీడిమెట్ల, మల్లాపూర్, చర్లపల్లి, కుషాయిగూడ, గాంధీనగర్, మౌలాలి, ఉప్పల్, కూకట్ పల్లి, బాలానగర్, కాటేదాన్, సనత్ నగర్, మేడ్చల్, పటాన్ చెరు, పాశమైలారం, రామచంద్రాపురం, హయత్ నగర్ సహా పలు ప్రాంతాల్లోని భూములను ఇతర అవసరాలకు వినియోగించనున్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 5వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా.. నివాస అవసరాల కోసం అపార్ట్ మెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ లు, ఆఫీసులు, హోటళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, స్పోర్ట్స్ జోన్ లు, పార్కులు, ఐటీ క్యాంపస్ ల నిర్మాణానికి అనుమతిస్తారు. పారిశ్రామికవాడల భూములను అభివృద్ధి చేయడం సరైన విధానమేనని సర్వత్రా చెప్తున్నారు. ఈ విధానాన్ని అడ్డుకోవద్దని ప్రతిపక్షాలకు సైతం హితవు పలుకుతున్నారు.

Comments are closed

Related Posts