తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయం గురించి తెలియని వారు ఎవరూలేరు.. మండలస్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు రేవంత్ చేసిన రాజకీయం ఎక్కువ శాతం విమర్శలు, సవాళ్లతోనే నిండి ఉంది. మొదటినుంచి పదునైన విమర్శలతో రాజకీయ శత్రువులను తూర్పారబట్టడంలో రేవంత్ రెడ్డి స్టైలే వేరు..
అనేక సవాళ్లను ఎదుర్కొని రేవంత్ రెడ్డి రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు, బీఆర్ఎస్ ప్రభుత్వం పై రేవంత్ చేసిన విమర్శలు ఘాటైన విమర్శలు రాష్ట్ర రాజకీయాల్ని ఆకర్షించాయి.. బుల్లెట్ల వంటి మాటల తూటాలతో టిఆర్ఎస్ నేతలు కిమ్మనకుండా తన వాగ్దాటితో విమర్శనాస్త్రాలు సంధించేవారు రేవంత్..
ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతిపక్షాలకు దీటైన సమాధానాలు ఇస్తున్నారు.. రేవంత్ విమర్శలకు బిఆర్ఎస్ నేతలు కనీసం కౌంటర్ ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. తాను ప్రజలకోసం పనిచేసుకుంటూ ముందుకెళ్తుంటే ప్రతిపక్షాలు తన పనిని అడ్డుపడుతున్నాయని, వారికి కూడా సరైన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే రేవంత్ ఈ విధంగా కేసిఆర్, కేటీఆర్ అండ్ కో కు ఎప్పటికప్పుడు చురకలు వేస్తున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ అడుగుతున్న ప్రశ్నలకు కనీసం బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంది.. తెలంగాణ రాజకీయాన్ని రేవంత్ ఎలా ముందుకు నడిపిస్తున్నారో దీనినిబట్టి అర్ధం చేసుకోవచ్చు.














Comments are closed