మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కీలక సూచనలు చేశారు.
గెలిచే అభ్యర్థులకే బీ-ఫారం ఇవ్వాలని స్పష్టంచేశారు. నాయకులు తమకు నచ్చిన వారికే టికెట్లు ఇవ్వాలనే ధోరణి సరికాదన్నారు. పార్టీశ్రేణులు సమష్టిగా పనిచేస్తేనే విజయం సాధ్యమని చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు దీనికి స్పష్టమైన ఉదాహరణ అని తెలిపారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్లో అందరూ కలిసి పనిచేసి విజయం సాధించామని గుర్తు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
చైర్మన్, మేయర్ పదవుల ప్రకటనలను ముందుగా చేయవద్దని సూచించారు. సామాజిక సమీకరణాల ఆధారంగా చైర్మన్లను ఎంపిక చేయాల్సి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.













Comments are closed