Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Telangana
  • Hyderabad
  • రైజింగ్ సమ్మిట్.. తొలిరోజే సూపర్ హిట్.. అన్నీ తానే నడిపించిన సీఎం రేవంత్..

రైజింగ్ సమ్మిట్.. తొలిరోజే సూపర్ హిట్.. అన్నీ తానే నడిపించిన సీఎం రేవంత్..

rising summit revanth reddy

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో భారీఎత్తున పెట్టుబడులు పోటెత్తాయి.. మొదటిరోజే 35 సంస్థలు సుమారు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు పెట్టేందుకు ముందుకువచ్చాయి.. వీటిలో రాష్ట్రంలోని ప్రఖ్యాత సంస్థలైన మైహోం, అపోలో సంస్థలతోపాటు విదేశీ సంస్థలైన డొనాల్డ్‌ ట్రంప్‌, విన్‌ గ్రూపులూ పెట్టుబడులు పెట్టాయి. రాష్ట్రంలోని పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ప్రపంచ పారిశ్రామికవేత్తల ముందు ఆవిష్కరించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు కేంద్ మంత్రి కిషన్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, నోబెల్‌ గ్రహీత కైలాశ్‌ సత్యార్థి, అపోలో సంస్థల వైస్‌ చైర్మన్‌ శోభన కామినేని, ట్రంప్‌ గ్రూపు డైరెక్టర్‌ ఎరిక్‌ స్విడర్‌ తదితరులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలతోపాటుదేశ, విదేశాల నుంచి పలువురు పెట్టుబడిదారులు, కన్సల్టెంట్లు, బ్యాంకింగ్‌ ప్రతినిధులు రముఖులు తరలి వచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తూ.. ‘రండి.. మా తెలంగాణ రాష్ట్రంలో అవకాశాలు చూడండి.. పెట్టుబడులు పెట్టండి’ అని పిలుపునిస్తే.. వాటిని అందిపుచ్చుకునేందుకు సిద్ధమంటూ పెట్టుబడిదారులు ఒప్పందం చేసుకున్నారు. గతంలోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ దావోస్‌ వెళ్లారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో పాల్గొన్నారు. దాంతోపాటు తెలంగాణలోనే ఈస్థాయి కార్యక్రమం చేపట్టాలని భావించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా దావోస్ నే హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్‌ వేదికగా తొలిసారి నిర్వహించిన సదస్సు సూపర్‌ హిట్ అయ్యి రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకోవడం సాధారణ విషయం కాదు..

గత పదేళ్లలో ఎప్పుడూ లేనట్లుగా తెలంగాణకు ఒక విజన్‌ను రూపొందించి.. అభివృద్ధికి భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసిన సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రపంచ ఆర్థిక వేదిక ఎండీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతినిధి ఎరిక్‌ స్విడర్ తోపాటు అందరూ ప్రశంసల్లో ముంచెత్తారు. ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ 41వేల కోట్లు పెట్టుబడి పెడుతూ స్విడర్‌ అయితే సీఎం రేవంత్‌ను ఆకాశానికి ఎత్తేశారు. రాబోయే పదేళ్లలో లక్ష కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించారు.

తొలిరోజు పెట్టుబడులు సంస్థల వివరాలివే..

సోలార్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో మిస్సైల్‌ భాగాలు, ఏరో ఇంజన్‌ స్ట్రక్చర్‌కు రూ.1,500 కోట్లు, ఎంపీఎల్‌ లాజిస్టిక్స్‌ కంపెనీ రూ.700 కోట్లు, టీవీఎస్‌ ఐఎల్‌పీ రూ.200 కోట్లు పెట్టుబడులకు ముందుకొచ్చాయి.

రెన్యూసిస్‌, మిడ్‌వెస్ట్‌, అక్షత్‌, గ్రీన్‌ టెక్‌ ఎలకా్ట్రనిక్స్‌, హైడ్రోజన్‌ టెక్‌ విస్తరణకు రూ.7,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి.

డిస్ట్రిబ్యూటెడ్‌ హైడ్రోజన్‌ టెక్నాలజీ రంగంలో సోహీ టెక్‌ ఇండియా రూ.1,000 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కృష్ణా పవర్‌ యుటిలిటీస్‌ రూ.5,000 కోట్లు, సిమెంట్‌ రంగ విస్తరణకు అల్ర్టా బ్రైట్‌ సిమెంట్స్‌, రెయిన్‌ సిమెంట్స్‌ రూ.2000 కోట్ల
పెట్టుబడులకు ముందుకొచ్చాయి.

సీతారాం స్పిన్నర్స్‌ రూ.3 వేల కోట్లతో టెక్స్‌టైల్‌ యూనిట్‌ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది

షోలాపూర్‌ తెలంగాణ టెక్స్‌టైల్‌ అసోసియేషన్‌ అండ్‌ జీనియస్‌ ఫిల్టర్స్‌ పవర్‌ లూమ్‌ టెక్నికల్‌ యూనిట్‌ రూ.960 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

ప్రముఖ సంస్థ అతిరథ్‌ హోల్డింగ్స్‌ రాష్ట్రంలో 25 కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్లాంట్లు నెలకొల్పనుంది. వీటిని స్థాపించేందుకు 4 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

రాబోయే మూడేళ్లలో రూ.1700 కోట్లతో హైదరాబాద్‌లో అత్యాధునిక విశ్వవిద్యాలయం, వైద్య విద్య, పరిశోధనా కేంద్రం నిర్మాణానికి రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అపోలో సంస్థ ఒప్పందం చేసుకుంది.

అంతర్జాతీయ మోటార్‌ స్పోర్ట్స్‌ సంస్థ సూపర్‌ క్రాస్‌ ప్రపంచస్థాయి రేసింగ్‌ ట్రాక్‌, శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

సిడ్బీ స్టార్టప్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ సంస్థ రూ.వెయ్యి కోట్లు పెట్టుబడులకు ముందుకొచ్చాయి.

వరల్డ్‌ ట్రేట్‌ సెంటర్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటుకు రూ.వెయ్యి కోట్లు. పెట్టుబడులకు ముందుకొచ్చాయి.

ఎవ్రెన్‌/యాక్సిస్ ఎనర్జీ రూ.31,500 కోట్లతో సోలార్‌ పవర్‌, విండ్‌ పవర్‌ మెగా ప్రాజెక్టులుముందుకొచ్చాయి.

రూ.8వేల కోట్లతో మేఘా ఇంజనీరింగ్‌ గ్రూప్‌ సోలార్‌, పంప్డ్‌ స్టోరేజ్‌, ఈవీ ప్రాజెక్టులు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఏరో స్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌ హాలింగ్‌తోపాటు కార్గో విస్తరణకు జీఎంఆర్‌ గ్రూప్‌ రూ.15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం

డిఫెన్స్‌, ఏవియానిక్స్‌ తయారీకి అపోలో మైక్రో సిస్టమ్‌ లిమిటెడ్‌ రూ.1,500 కోట్లు పెట్టుబడులు

ఈ సదస్సుల్లో విభిన్న రంగాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, విద్యుత్‌, రవాణా, విద్య, వైద్యం, ఐటీ, గ్రీన్‌ ఎనర్జీ, పర్యాటక రంగాల పారిశ్రామికవేత్తలు తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే ఫ్యూచర్‌ సిటీలో కొత్త జూపార్క్‌ ఏర్పాటుకు రిలయన్స్‌కు చెందిన వంతారా ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ పెట్టుబడులు రాష్ట్రాభివృద్ధికీ, పెద్దఎత్తున ఉద్యోగావకాశాల కల్పనకు దోహదపడనున్నాయి.

Comments are closed

Related Posts