Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Blog
  • విధ్వంసం నుంచి వికాసం దిశగా..రేవంత్ రైజింగ్ తెలంగాణ విజన్‌కు ప్రపంచం ఫిదా..!

విధ్వంసం నుంచి వికాసం దిశగా..రేవంత్ రైజింగ్ తెలంగాణ విజన్‌కు ప్రపంచం ఫిదా..!

rising telangana

ప్రపంచం చూపు…తెలంగాణ వైపు..యస్..ఇప్పుడు యావత్ ప్రపంచం తెలంగాణ వైపు సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది…సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు ఫిధా అవుతోంది…ఆయనకు దావోస్ సదస్సులో ఇంగ్లీష్ రాదని వెక్కిరించిన వాళ్లే..ఆ దావోస్ ‌ఆర్ధిక సదస్సుకు పదింతలు అన్నట్లుగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను చూసి ఆయన విజన్‌కు ఔరా అంటూ ఆశ్చర్యపోతున్నారు..ఇప్పటి వరకు ఒక లెక్క…ఇప్పటి నుంచి ఇంకో లెక్క అంటూ.. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో రాష్ట్రానికి మరో సరికొత్త చరిత్రను సీఎం రేవంత్ రెడ్డి స్వహస్తాలతో లిఖించబోతున్నారు. ఇక నుంచి తెలంగాణ గ్రోత్ …గ్లోబల్ సమ్మిట్‌కు ముందు…తర్వాత అన్నట్లుగా మాట్లాడుకోవడం ఖాయం..

సీఎం రేవంత్‌ రెడ్డికి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఎక్కువ…గత పదేళ్లు ఎన్నో కేసులు, మరెన్నో అవమానాలు..అయినా లెక్క చేయలేదు..బీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించి, ప్రజాస్వామిక వాతావరణంలో తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకుని ఎన్నికల క్షేత్రంలో అర్జునుడిలా పోరాడి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించారు. అధికారంలోకి రాగానే గడీల కంచెలు తొలగించి, ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు. గత పదేళ్లలో అన్ని రంగాలలో విధ్వంసానికి గురైన తెలంగాణను మళ్లీ సరికొత్తగా పునర్నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నడుం బిగించారు. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు నినాదంతో ఏర్సడిన తెలంగాణలో గత పదేళ్లు కొలువుల భర్తీ లేక యువత నిర్వీర్యమై పోయింది. కానీ రెండేళ్లలోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసి నియామక పత్రాలు అందజేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కింది. అలాగే చదువుతోనే భావితరాలకు భవిష్యత్తు అని నమ్మిన ఆయన కీలకమైన విద్యాశాఖ మంత్రిగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టారు. అలాగే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుదేలైనా ధృఢ సంకల్పంతో 6 గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వ నిర్వాకంతో మరింత అప్పుల పాలైన రైతన్నలకు రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసి వారిని రుణ విముక్తులను చేశారు. గత పాలకులకు సాధ్యం కాని సన్నబియ్యం పథకాన్ని అమలుచేసి పేదల జీవితాల్లో ఆనందం నింపారు. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500 కే గ్యాస్, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ రేవంత్ రెడ్డి సంక్షేమ పాలనకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 6 గ్యారంటీల్లో మిగిలిన 2 పథకాలను సైతం అమలు చేసి, హామీల అమలులో తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సీఎం రేవంత్ పట్టుదలగా ఉన్నారు

.ఓ పక్క ప్రజా సంక్షేమంలో తనదైన ముద్ర వేస్తూనే..మరో పక్క రాష్ట్ర అభివృద్ధికి తానే బ్రాండ్ అంబాసిడర్‌ బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా నాలుగవ నగరంగా..రేపటి తెలంగాణకు వేగుచుక్కగా… ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు. అదే ఫ్యూచర్‌ సిటీలో రైజింగ్ తెలంగాణ నినాదంతో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యంగా.. అత్యంత అద్భుత రీతిలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 ను నిర్వహించి ప్రపంచం చూపు తెలంగాణ వైపు చూసేలా చేసిన ఘనత..సీఎం రేవంత్ కే దక్కింది.

2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రాబోయే పదేళ్లలో ఫ్యూచర్ సిటీలో ఏకంగా లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూపు కార్ప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ చేసిన ప్రకటన సీఎం రేవంత్ విజన్‌కు నిదర్శనంగా భావించ వచ్చు. దువ్వూరి సుబ్బారావు, డికే శివకుమార్, చిరంజీవి, నాగార్జున వంటి ప్రముఖులతో పాటు వివిధ దేశాల నుంచి తరలివచ్చిన దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులతో 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా, భవిష్యత్ తెలంగాణకు రోడ్ మ్యాప్‌గా జరిగన ఈ గ్లోబల్ సమ్మిట్ రికార్డు స్థాయిలో రూ. 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులతో సంచలనం సృష్టించింది. అంతేకాదు .మా పోటీ పక్క రాష్ట్రాలతో కాదు, సింగపూర్, చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి అగ్రదేశాలతో పోటీ అంటూ… 2047 నాటికి రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలను చేరుకునేలా 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించడమే ధ్యేయంగా రూపొందించిన రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు.

నిన్నటి వరకు ఒక లెక్క…రేపటి “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్” తర్వాత మరో లెక్క అంటూ..రెండేళ్లలోనే సంక్షేమం, అభివృద్ధిని జోడు గుర్రాల్లో పరిగెట్టిస్తూ..తెలంగాణ ప్రజల ఆశీర్వాదమే ఆయుధంగా..4 కోట్ల ప్రజల ఆకాంక్షలను సంపూర్ణమే లక్ష్యంగా..విధ్వంసం నుంచి వికాసం దిశగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి రైజింగ్ తెలంగాణ విజన్‌కు యావత్ ప్రపంచం ఫిదా అవుతోంది. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికతో రాజకీయంగా పెరిగిన రేవంత్ ప్రతిష్ట…ఈ గ్లోబల్ సమ్మిట్‌తో శిఖరాగ్రానికి చేరింది. ప్రస్తుతం దేశంలోనే ది బెస్ట్ రైజింగ్ అండ్ డైనమిక్ సీఎంగా రేవంత్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది అనడంలో సందేహం లేదు.

Comments are closed

Related Posts