Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Movie
  • Adventure
  • సింగరేణిలో పెద్దపులి సంచారం.. టెన్షన్ లో కార్మికులు

సింగరేణిలో పెద్దపులి సంచారం.. టెన్షన్ లో కార్మికులు

సింగరేణిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఎస్ఆర్పి 3మైన్స్, కోల్ బెల్ట్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే5, ఎసంఘమల్లెపల్లి పరిసర ప్రాంతంలో సింగరేణి కార్మికులకు పెద్దపులి కనిపించడంతో వారంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో జిల్లా అటవీశాఖ అధికారి ఆశిష్ సింగ్ ఆధ్వర్యంలో రెండు బృందాలు ఘటనా స్థలికి చేరుకుని పులి జాడకోసం అన్వేషిస్తున్నారు. అయితే గతంలోనూ అదే ప్రాంతంలో పులి సంచరించినట్లు కార్మికులు చెబుతుండడతో మరోసారి పెద్దపులి సంచారంతో సింగరేణిలో హైటెన్షన్ నెలకొంది.

పెద్దపులి ఎప్పుడు, ఎక్కడి నుంచి వస్తుందోనని సింగరేణి కార్మికులు, వాహనదారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పులి సంచారంతో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సింగరేణి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దని, రాత్రి పూట ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచనలు చేశారు. అలాగే వీలైనంత త్వరగా పెద్దపులిని పట్టుకోవాలని అటవీ అధికారులను సింగరేణి కార్మికులు కోరుతున్నారు. మరోవైపు పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Comments are closed

Related Posts