Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Movie
  • Crime
  • Sucied : అనుమానించడంతో యువతి ఆత్మహత్య

Sucied : అనుమానించడంతో యువతి ఆత్మహత్య

ఆ యువకుడు ప్రేమించానన్నాడు… పెళ్లిచేసుకుందామని చెప్పాడు. పెద్దలూ అంగీకరించాక… ఆ యువకుడు అనుమానించడంతో ఆ యువతి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకైపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం… ఖమ్మం సమీపం లోని కొత్తగూడెం పట్టణానికి చెందిన ఐశ్వర్య(19) తన అన్న అరవింద్ కలిసి నాగోలు సమీపంలోని తట్టిఅన్నారం వైఎస్ఆర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఆమె ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తోంది. అన్న ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరి దూరపు బంధు వైన మహేష్ అలియాస్ ఆనంద్ (23) నగరంలోని హస్తినాపురంలో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. ఏడాదిక్రితం జరిగిన అయ్యప్ప పూజలో ఐశ్వర్యను చూసిన మహేష్ బంధుత్వంతో తరచూ వారి ఇంటికి వచ్చే వాడు. ఇటీవల ఆమెను ప్రేమిస్తున్నానంటూ.. పెళ్లిచేసుకుంటానంటూ వెంటపడటంతో ఆమె సరేనంది. మొదట పెద్దలు నిరాకరించినా.. వారూ అంగీకరించారు. ఇటీవల ఆమెతో చనువుగా ఉంటున్న ఆనంద్.. ఆమె మరెవరితోనో ఫోన్లో తరచూ మాట్లాడుతోందని అనుమానం పెంచుకు న్నాడు.

ఈ నెల 5న ఇరువురూ తరచూ కలుసుకునే హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. ఫోన్ల విష యమై ఆనంద్ నిలదీయడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ క్రమంలో ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్పైకి ఎక్కి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అతను వద్దని వారించేలోపే ఈ దుర్ఘటన జరిగిపోయింది. ఆమెను నాగోలులోని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందింది. నాగోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు కారణమైన మహేష్ అలియాస్ ఆనంద్ పై ఐశ్వర్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసికొని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Comments are closed

Related Posts