Hyderabad : అగర్వాల్ సమాజ్ తెలంగాణ ఆధ్వర్యంలో రాజేశ్ కార్పొరేషన్ సహకారంతో నిర్వహించిన ఏఎస్టీ సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలేలో తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. జూనియర్ విభాగంలో రోహన్ అగ్రవాల్, సీనియర్ విభాగంలో విశ్వనాథ్ అగ్రవాల్ తమ మధుర స్వరాలతో మంత్ర ముగ్ధులను చేస్తూ ప్రథమ స్థానాన్ని సాధించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారిని ప్రోత్సహించేందుకు సమాజ బంధువులు కుటుంబాలతో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సోమవారం నిర్వహించిన సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం మహారాజా అగ్రసేన్ జీ పూజా అర్చనతో ప్రారంభమైంది. ఫైనలిస్టులుగా కనక్ పిట్టి, ప్రశాంత్ దేవ్ గుప్తా, రోహన్ అగ్రవాల్, సందీప్ కుమార్ అగ్రవాల్, వికాస్ అగ్రవాల్, అమిత్ కుమార్ అగ్రవాల్, అనూప్ కుమార్ అగ్రవాల్, అశోక్ బంసల్, దీపక్ అగ్రవాల్, మాణికలాల్ అగ్రవాల్, నిధీష్ సింగల్, శిఖా అగ్రవాల్, ఉమేష్ కుమార్ అగ్రవాల్, విశాల్ అగ్రవాల్, విశ్వనాథ్ అగ్రవాల్ తమ ప్రదర్శనలతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. పాల్గొన్నవారు రెండు రౌండ్లలో తమ గాన ప్రతిభను ప్రదర్శించారు. న్యాయ నిర్ణేతలుగా వీణ మ్యూజిక్ ఛైర్మన్ కె.సి. మాలూ, ప్రసిద్ధ ఘజల్ గాయకుడు శరద్ గుప్తా, ప్రముఖ గాయని అపూర్వా గురు హాజరయ్యారు.
45 సంవత్సరాల పైబడిన విభాగంలో ప్రథమ స్థానం విశ్వనాథ్ అగర్వాల్, ద్వితీయ స్థానం అమిత్ కుమార్ అగర్వాల్, తృతీయ స్థానం మాణికలాల్ అగ్రవాల్ సొంతం చేసుకున్నారు. న్యాయనిర్ణేత కె.సి. మాలూ మాట్లాడుతూ సమాజంలోని గాన ప్రతిభ ఎంతో ఉన్నతంగా వెలుగులోకి వచ్చిందని, ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిర్వహించి ప్రతిభను మరింత ప్రోత్సహించాలని అన్నారు. న్యాయనిర్ణయం చేయడం కష్టం అయినా, ఎవరికీ అన్యాయం చేయాలన్న ఉద్దేశం లేదన్నారు. ఈసారి బహుమతి పొందని వారు వచ్చే సారి తప్పకుండా పాల్గొని ఉత్సాహాన్ని కొనసాగించాలని సూచించారు. గాయకులు శరద్ గుప్తా, అపూర్వా గురు పాల్గొన్న వారిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అగర్వాల్ సమాజ సభ్యత్వ కార్యక్రమానికి సంబంధించిన యాప్ ను ఆవిష్కరించారు. యాప్ వివరాలను ఛైర్మన్ రితేశ్ అగ్రవాల్ వివరించారు. తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా అందరినీ స్వాగతిస్తూ ఈ సభ్యత్వ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరినీ సమాజంతో అనుసంధానం చేయాలన్నదే లక్ష్యమన్నారు. సమాజంలో లక్ష మంది సభ్యులను చేరుస్తామన్న లక్ష్యం ఉందని చెప్పారు. అందరూ యాప్ ద్వారా సభ్యత్వం పొందుతూ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రివిలేజ్ కార్డ్ లాభాలు పొందాలని కోరారు. సమాజం బలంగా ఉంటే ప్రభుత్వం మన వద్దకే వస్తుందని, అందుకే ఈ నిర్ణయాన్ని గంభీరంగా తీసుకోవాలన్నారు. ఉపాధ్యక్షుడు, కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యుడు రూపేశ్ అగర్వాల్ మాట్లాడుతూ సభ్యత్వంపై సమాజం ఎక్కువ దృష్టి పెడుతోందని, ఎందుకంటే కలిసుంటేనే ఎదుగుతామని, సురక్షితంగా ఉంటామని అన్నారు. అందరూ ఏకమై యాప్ ద్వారా తమతో పాటు తమ బంధువులను కూడా సభ్యులుగా చేర్చాలని కోరారు.










Comments are closed