At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.
ఒక అవినీతిపరుడు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నేర స్వభావి చేతికి అధికారం వస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అవన్నీ రాష్ట్రంలో జరుగుతున్నాయంటూ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు నిత్యం అంటుండేవారు.. ప్రత్యర్థులపై కక్ష సాధించడం అన్నది ఫ్యాక్షనిస్టుల స్వభావం అని.. జగన్ ఆమాదిరిగా చేస్తున్నారని విమర్శించేవారు.. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్, చింతమనేని ప్రభాకర్ సహా రాష్ట్రంలోని వందలాదిమంది టీడీపీ నేతలను అరెస్ట్ లు చేసినపుడు చంద్రబాబు ఇలాగే ఖండించేవారు. దళిత డాక్టర్ సుధాకర్ ఘటనతోపాటు, దళిత యువకుడి డోర్ డెలివరీ వంటి ఘటనలు జరిగినపుడు జగన్ నేరస్వభావి అనే ప్రచారాన్ని టీడీపీ హోరెత్తించింది.
ఒక విధంగా వైసీపీ అధికారం కోల్పోవడానికి ఇది కూడా ఒక కారణం.. చంద్రబాబు కూడా ఒకానొక సందర్భంలో జగన్ ను దేశంలోనే అతిపెద్ద డ్రగ్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కో బార్ తో పోల్చారు..
అయితే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు.. అయినా మరోసారి జగన్ నేరస్వభావి అనే విమర్శనాస్త్రాలను టీడీపీ సంధిస్తోంది. ప్రధానంగా పరకామణి కేసులో జగన్ మాట్లాడిన విధానాన్ని టీడీపీ నేలు ఎండగడుతున్నారు. డిబేట్లలో వైసీపీకి కౌంటర్ ఇస్తూ… చిన్నప్పుడు పరీక్షా పేపర్లు దొంగతనం చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజాధనాన్ని కొల్లగొట్టారని, మళ్లీ ఇప్పుడు పరకామణి దొంగతనం అన్నట్టు మాట్లాడుతుండడం ఆయన నేరస్వభావి అనడానికి నిదర్శనమంటున్నారు.
జగన్ నేరస్వభావి.. అప్పుడు “పరీక్షా పేపర్లు”.. ఇప్పుడు “పరకామణి”

Related Tags: