పాన్ ఇండియన్ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్ ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, రుక్మణీ వసంత్, హుమా ఖురేషి, తార సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. కేజీఎఫ్ 1, 2 లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో సినిమాపై దేశ వ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.. అయితే తాజాగా యణ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజ్ చేసిన క్షణాల్లోనే మిలియన్ల కొలది వ్యూస్ రాబడుతోంది.
గ్లింప్స్ విషయంలో యష్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటుండగా.. ఓ స్మశాన వాటికలో ఓ చిన్న ఫ్యామిలీ తమ కుటుంబ సభ్యుడికి అంత్యక్రియలు చేస్తుండగా అదే సమయంలో ఓ విలన్ గ్యాంగ్ వచ్చి వారిని హింసించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. సరిగ్గా అప్పుడే ఓ కారులో హీరో వస్తు వస్తూనే కారులోనే అమ్మాయితో శృంగారం చేస్తుండగా విలన్ గ్యాంగ్‌పై బాంబు పేలేలా ఉంటుుంది.. హీరో కారు దిగి డైలాగ్ చెప్పి, యాక్షన్ మోడ్‌లోకి రావడం ఆ వీడియోలో ఉంటుంది.
ఈ గ్లింప్స్ కాస్త జుగుప్సాకరంగా అనిపిస్తోందిది. అంతపెద్ద స్టార్ హీరో అయి ఉండి అయన ఎలివేషన్‌కు అలాంటి సీన్ పెట్టడం కరెక్టేనా.. యూత్‌కు ఎలాంటి మెసేజ్ ఇద్దామని ఇలాంటి దృశ్యాలు పెడతారు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ కారు సీన్ గించి ఉంటే బావుండేది కదా, దాంతో హీరోకు ఎలివేషన్ ఏంటి చండాలంగా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే ఓ లేడీ డైరెక్టర్ అయి ఉండి ఇలాంటి సన్నివేశం ఎలా తీయగలిగింది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.









Comments are closed