మహా పాపంలో మరో ఘోరం వెలుగు చూసింది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో టాయిలెట్ క్లీనర్‌లో వాడే కెమికల్స్ కలిపారనే భయంకర నిజాన్ని సిట్ విచారణ బయటపెట్టింది. ఔను మీరు ఇది నిజమే. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు నెయ్యికి బదులు కెమికల్స్ కలిపిన పామాయిల్‌తో లడ్డూ ప్రసాదం తయారు చేశారని సీబీఐ సిట్ తేల్చి చెప్పింది. పామాయిల్‌ని నెయ్యిలా కనిపించేలా చేయడానికి వాడిన పదార్ధాలను విశ్లేషిస్తే.. వీటిలో దారుణమైన, అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో ఒక కెమికల్ లబ్‌సా. దీని పూర్తి పేరు లీనియర్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనిక్ ఆసిడ్.ఈ లబ్‌సా అనే కెమికల్‌ని హార్పిక్ లాంటి టాయిలెట్ క్లీనర్లు, డిటర్‌జెంట్ల, లిక్విడ్ క్లీనర్స్ తయారీకి వినియోగిస్తారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డెయిరీ 2022 నుంచి 2024 వరకు 8 వేల 900 కిలోల లబ్‌సాని కొనుగోలు చేసినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో బయటపడింది.
ఒక డెయిరీ సంస్థకు ఇన్ని వేల కేజీల టాయిలెట్ క్లీనింగ్ కెమికల్‌తో అవసరమేంటి అని కెమికల్ ఇంజనీర్లను ఆడిగితే వాళ్ల నుంచి మతిపోయే సమాధానం వచ్చింది. పామాయిల్ నెయ్యిలా కనిపించాలంటే అందులో జంతువుల కొవ్వు కలపాలి. బీఫ్ టాలో అంటే గొడ్డు కొవ్వు.. లేదా లార్డ్ అంటే పంది కొవ్వుని నేరుగా పామాయిల్‌లో కలిపితే టెస్టుల్లో తెలిసిపోతుంది. పరీక్షల్లో పట్టుబడకుండా ఉండాలంటే.. లబ్‌సా లాంటి క్లీనింగ్ ఏజెంట్లతో జంతువుల కొవ్వుని వాష్ చేస్తారు. ఇలా వాష్ చేసిన కొవ్వులను కలపడం వల్లే కల్తీ నెయ్యిలో లబ్‌సా అవశేషాలు కనిపించాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.లబ్‌సా లాంటి ఎసిడిక్ కెమికల్స్ మీద పడితే చర్మం కాలిపోతుంది.. వీటి నుంచి వచ్చే ఆవిరి, వాసన పీల్చినా.. ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలాంటి దారుణమైన రసాయనాలను దేవుడి ప్రసాదంలో కలిపితే.. దాన్ని తిన్న భక్తుల ఆరోగ్యానికి ఎంత నష్టం జరిగిందో ఊహించుకోవడానికే భయమేస్తోంది. అవులు లేని.. పాల సేకరణ యంత్రాంగం లేని భోలే బాబా డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టడమే ఈ అనర్ధానికి అసలు కారణం. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకుండా.. అర్హత లేకపోయినా.. నిబంధనలు మార్చి.. నెయ్యి పేరుతో కెమికల్ విషాన్ని సరఫరా చేయడానికి గేట్లు ఎత్తిన అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి వంటి వాళ్లే అసలు దోషులని ఏపీ కేబినెట్ అభిప్రాయపడింది. ఈ సూత్రధారుల పాత్ర తేల్చడానికి ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. దేవ దేవుడి సొమ్ము దోచుకొని ఘోర అపచారం చేసిన వారికి కఠిన శిక్ష విధించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.















Comments are closed