వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి జైలుకు వెళ్తారా? మరోసారి ఆయన అరెస్టు తప్ప దా? అంటే.. ఔననే సంకేతాలు వినిపిస్తున్నాయి. తాజాగా విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీపై ఓ కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీపై కేసు నమోదు చేశారు. 2024లో జులైలో తనపై వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడినట్లు సునీల్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనను అక్రమంగా నిర్బంధించి బెదిరించారని.. కొట్టారని పేర్కొంటూ మాచవరానికి చెందిన సునీల్ వంశీపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వంశీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనను అక్రమంగా నిర్బంధించి హింసించారని ఆయన తెలిపారు. ఒకానొక సమయంలో చంపేస్తామని బెదిరించారని కూడా పేర్కొన్నారు.
వంశీ సహా మరో 8మందిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సత్యవర్థన్‌ను వంశీ అండ్ కో కిడ్నాప్ చేసి దాడి చేశారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో వల్లభనేని వంశీ జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. 2023లో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది.
ఈ దాడిలో ప్రధాన సాక్షిగా సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదే కీలకంగా మారింది. ఈ క్రమంలో సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. సుమారు 13నెలలు వంశీ విజయవాడ జైల్లో ఉన్నారు. అనారోగ్యసమస్యలు చూపిం చి ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు.
దీంతోపాటు.. అక్రమ మైనింగ్, ఎన్నికల అధికారులను బెదిరించడం వంటి కేసులు కూడా వెంటాడుతున్నాయి. గత ఏడాది జూలైలో తాను వంశీ వ్యవహారాలపై సోషల్ మీడియాలో స్పందించినట్టు సునీల్ తెలిపారు. అక్రమ మైనింగ్ కేసు నమోదైన తర్వాత.. దానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించ డంపై తనను ఇబ్బంది పెట్టారని తెలిపారు.
దీంతో మాచవరం పోలీసులు వంశీ సహా మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఎస్సీ,ఎస్టీ కేసును కూడా పెట్టినట్టు తెలిసింది. అదేవిధంగా హత్య యత్నం సహా.. బెదిరింపులు, కిడ్నాప్ వంటి సెక్షన్లు కూడా నమోదు చేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు వంశీపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దీంతో వంశీని మరో సారి అరెస్టు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అనారోగ్య కారణాలతో బయటకు వచ్చిన వంశీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో సదరు బెయిల్‌ను రద్దు చేసేలా కోర్టును ఆశ్రయించనున్నట్టు రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది.










Comments are closed