At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.
తాజాగా వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత జగన్ మాట్లాడుతూ తిరుమల పరకామణి దొంగతనం చిన్న దొంగతనం అని వ్యాఖ్యలు చేయడం దారుణమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి తీవ్రఆగ్రహంవ్యక్తం చేశారు. జగన్ తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరకామణి కేసును హైకోర్టు సీరియస్‌గా తీసుకుందన్నారు. హిందూ దేవాలయాలపై జగన్‌కు ఎందుకింత ద్వేషమని ప్రశ్నించారు. లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేయించినట్లు డ్రామా ఆడారని, గతంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కనుసన్నల్లో ఈ వ్యవహారం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఒక సాధారణ ఉద్యోగి రవికుమార్ రూ.14.40 కోట్లు ఎలా ఇచ్చారని నిలదీశారు. ఒక సాధారణ ఉద్యోగి రవికుమార్ 14.40 కోట్లు ఇచ్చారంటే అవినీతి ఎంత జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. జగన్‌కు హిందువులు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు. పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తిని జగన్ వెనకేసుకొచ్చారని మండిపడ్డారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు జగన్ ఏనాడు సతీసమేతంగా హాజరు కాలేదని విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డి తిరుమల డిక్లరేషన్‌పై సంతకం పెట్టలేదని, జగన్‌కు హిందువులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలు 11సీట్లు ఇచ్చి పక్కన పెట్టినా కూడా.. జగన్‌కు బుద్ధి రావడం లేదని విమర్శించారు. హిందూ మతంపై దాడి చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారంటూ స్వామి శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ కు హిందువులు ఓట్లు వేయలేదా.?

Related Tags: