Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • దేశ చరిత్రలో ఇంతకంటే పెద్ద స్కామ్ ఉండదు..!

దేశ చరిత్రలో ఇంతకంటే పెద్ద స్కామ్ ఉండదు..!

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశంలోనే అతిపెద్ద స్కాం అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేశారు.

అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చేస్తున్న అన్యాయాలను, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలను గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ప్రజల నిరసనలు, ఆధారాలతో సహా పూర్తి వివరాలు అందించామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజలు జీవించలేరన్నారు. వైద్యం, విద్య లాంటి మౌలిక సేవలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని. వ్యవస్థలను ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వం ఇంకా ఎందుకు.? అని జగన్ ప్రశ్నించారు.

తమ వైసీపీప్రభుత్వ హయాంలో ఒక విజన్‌తో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని, ప్రతి కాలేజీలో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ సేవలు ఉచితంగా అందేలా చూశామన్నారు. పేదవారి ఆరోగ్యానికి భరోసాగా మెడికల్ కాలేజీలు నిలిచాయి.

ఇప్పుడు వాటిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే పేదలకు వైద్యం దూరమవుతుందన్నారు. మెడికల్ కాలేజీల వేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలు ప్రజల బలమైన నిరసనకు నిదర్శనమని జగన్ పేర్కొన్నారు.

మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడమే అతిపెద్ద స్కాం అని జగన్ విమర్శించారు. ఆ కాలేజీల్లో ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరో స్కాం అన్నారు. రూ.120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కింద ఎలా ఇస్తారు.? అని ప్రశ్నించారు.

కాలేజీలు ప్రైవేటుకు ఇచ్చి జీతాలు ప్రభుత్వం ఇవ్వడం లాంటివి దేశ చరిత్రలో ఇంతకన్నా పెద్ద స్కాం ఉండదు అని జగన్ ధ్వజమెత్తారు.

Comments are closed

Related Posts