Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Telangana
  • Hyderabad
  • కవితను కుక్కతో పోల్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. బంగారం షాపుల్లో దోచుకున్నదంటూ ఫైర్

కవితను కుక్కతో పోల్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. బంగారం షాపుల్లో దోచుకున్నదంటూ ఫైర్

kavitha as dog

తండ్రి, అన్న పట్టించుకోవటం లేదని, ఇకపై తాను సొంతంగా రాజకీయంగా ఎదుగుతానని జాగృతి పేరుతో నూతన రాజకీయం ప్రారంభించిన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పై వరుస విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈక్రమంలో కవిత విమర్శలపై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. ఎవరూ ఊహించని విధంగా కవితపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కవితను కుక్కతో పోల్చడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు..

హరీశ్‌రావుపై లేని నిందలు వేసి పార్టీ నుండి వెళ్ళగొట్టి, రేవంత్ రెడ్డితో కలిసి కేటీఆర్‌ను జైలులో వేసి.. తెలంగాణను దోచుకోవడానికి కవిత చూస్తోందని మాధవరం ఘాటుగా ఆరోపించారు. మీడియా చానళ్ల సమావేశం ఏర్పాటు చేసిమరీ కవితపై మాధవరం ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజాగా కవిత హైదరాబాద్ లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను బీటీ బ్యాచ్ అని విమర్శించారు. ఉద్యమం చేయకుండా తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చి పదవులు అనుభవిస్తున్నారన్నారు. ఈ వ్యాఖ్యలు మాధవరంకు ఆగ్రహం తెప్పించాయి.. హైదరాబాద్ ఎమ్మెల్యేలపై కవిత కనీసం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, నీ గురించి చెబితే తల ఎక్కడ పెట్టుకుంటావో తెలియదంటూ మాధవరం రెచ్చిపోయారు. సిటీలోని బట్టలషాపులు, బంగారు షాపులను వదలకుండా దోచుకున్న నువ్వే నన్ను విమర్శిస్తావా..? మీ అత్తగారి ఊర్లో గెలవడం చేతకాని నీవు మాపై మాట్లాడుతావా.. అంటూ మాధవరం ఆగ్రహం వ్యక్ చేశారు. చరిత్ర హీనురాలైన కవితకు తమ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం ఆయనతో కలిసి నడుస్తున్నామని.. నగరంలో ఉండే ఎమ్మెల్యేలను బీటీ బ్యాచ్ అంటుందా అని మండిడ్డారు. ఉద్యమంలో పనిచేయకపోయేనా తామంతా తెలంగాణ కోసం పని చేశామన్నారు. కవితే తెలంగాణ చరిత్రను లిక్కర్ పేరుతో నాశనం చేసిదంని విరుచుకుపడ్డారు. కవిత ఇంట్లో కుక్ పేరు విస్కీ అని పెట్టుకున్నారని.. మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన నన్ను అనే స్థాయి నీకు లేదన్నారు. నీలాంటి కుక్కలు మెరిగి పోయాయన్నారు.

కవిత బండారం బయట పెడితే తెలుస్తుందని, నగరంలో ఏ బంగారం షాపు వదలలేదని .. బాలానగర్ లో కవిత భర్త కబ్జాల చిట్టా ఉందని విమర్శించారు. బాలానగర్ లో ఓవర్ ల్యాప్ ల్యాండ్ ని పార్టీపేరు చెప్పుకొని క్లియర్ చేసుకున్నావు.. మర్యాదగా చెప్తున్నా జాగ్రత్త గా మాట్లాడు అని హెచ్చరించారు. మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మాట్లాడితే సహించమన్నారు.

Comments are closed

Related Posts