Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • నైపుణ్య గణనకి సహకరించాలని అశ్వినీ వైష్ణవ్ ను కోరిన మంత్రి లోకేష్

నైపుణ్య గణనకి సహకరించాలని అశ్వినీ వైష్ణవ్ ను కోరిన మంత్రి లోకేష్

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్టవ్ తో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రారంభమయ్యే పలు ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్య గణనకోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీ తో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి లోకేష్ కేంద్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు వివరించారు. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో నిర్వహించిన పైలెట్ ప్రాజెక్ట్, అందులో ఎదుర్కున్న సమస్యలను అధిగమించడానికి ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానం తీసుకొచ్చామని వివరించారు. త్వరలో రాష్ర వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్ర సహాయం కావాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యవస్థాపకులకు అద్భుతమైన వేదికగా ఏర్పాటుచేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు MeitY స్టార్టప్ హబ్ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో AVGC-XR, WAVEX ఫ్రేమ్‌వర్క్ కింద InnoXR యానిమేషన్, AR/VR, Immersive Technologies కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు సహకారం అందించాలని, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మిషన్ కింద రాష్ట్రంలో ఏఐ విస్తృతి వేగవంతానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

Comments are closed

Related Posts