Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Gadget
  • Desk
  • విందు రాజకీయంలో గెలిచేదెవరు.. ? డీకేనా, సిద్ధ రామయ్యా..

విందు రాజకీయంలో గెలిచేదెవరు.. ? డీకేనా, సిద్ధ రామయ్యా..

కర్ణాటకలో బెళగావి మాజీఎమ్మెల్యే ఫిరోజ్ సైత్ తాజాగా ఇచ్చిన విందుకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కొంతమంది మంత్రులు సహా 30మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారిలో మంత్రులు కేహెచ్‌ మునియప్ప, మంకాల్‌ వైద్య, డాక్టర్‌ ఎంసీ సుధాకర్‌, ఎమ్మెల్యేలు ఎన్‌ఏ హరీస్‌, రమేష్‌ బండిసిద్దెగౌడ, హెచ్‌సీ బాలకృష్ణ, గణేష్‌ హుక్కేరి, దర్శన్‌ ధృవనారాయణ, అశోక్‌ కుమార్‌ రాయ్‌, కేవై నంజేగౌడ ఉన్నట్లు సమాచారం. బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరాం హెబ్బార్ కూడా విందుకు హాజరయ్యారు. డిన్నర్‌కు సిద్ధరామయ్య బ్యాచ్.. అంతకుముందు డిసెంబర్ 10l ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు, సీఎంకు సన్నిహితంగా ఉన్న కొంతమంది శాసనసభ్యులు ఫిరోజ్ సైత్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. విందుకు హాజరయిన నాయకులంతా ఇది సాధారణ విందేనని, విశేషమేమీ లేదని చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవిపై అధికార పార్టీలో సీఎం,డిప్యూటీ సీఎంలకు మధ్య జరుగుతున్న తరుణంలో ఈ విందు సమావేశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

2023అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవికోసం సిద్ధరామయ్య, డీకేశివకుమార్ పోటీపడ్డారు. పార్టీ అధిష్టానం జోక్యంతో డీకే ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఐదేళ్ల పదవీకాలంలో రెండున్నరేళ్ల పాటు సిద్ధరామయ్య, మిగతా రెండున్నరేళ్లు డీకే కొనసాగేలా ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఈనేపథ్యంలో నవంబర్ 20 నాటికి సిద్ధరామయ్య పదవీకాలం పూర్తయ్యింది. ఇద్దరిమధ్య ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని ప్రజలకు చెప్పేందుకు పార్టీ అధిష్టానం సూచనమేరకు ముఖ్యమంత్రి, డిప్యూటీసీఎం ఇద్దరూ ఒకరి నివాసాలలో ఒకరు అల్పాహారం చేశారు. బెళగావి విందు ఇద్దరిమధ్య నాయకత్వ పోరుకు విరామం చెప్పడానికి, సిద్ధరామయ్య ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించడానికి ఈ విందు ఒక సంకేతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments are closed

Related Posts